Khammam: ఖమ్మంలో శ్రీవారి ఆలయ శంకుస్థాపన: తుమ్మల యుగంధర్ కృషి!

Khammam: ఖమ్మంలో టీటీడీ శ్రీవారి దివ్యాలయ నిర్మాణానికి చిన్నజీయర్ స్వామి, మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో భూమిపూజ జరిగింది.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 13 Oct 2026 7:19 PM IST
Khammam
X

Khammam: ఖమ్మంలో శ్రీవారి ఆలయ శంకుస్థాపన: తుమ్మల యుగంధర్ కృషి!

ఖమ్మం: ఖమ్మం నగరంలోని అల్లిపురం కొత్తగూడెం ప్రాంతంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటే శ్వరస్వామివారు ఖమ్మంలో కొలువుదీరేం దుకు తొలి అడుగు పడింది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో శ్రీవారి దివ్యాలయ నిర్మాణానికి టీటీడీ సోమవారం శ్రీకారం చుట్టింది.

వేద మంత్రోచ్చారణలు,మంగళవాయిద్యాల నడుమ శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారు శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వ హించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వ రరావు పాల్గొన్నారు.

వేదమంత్రాల సాక్షిగా ఆధ్యాత్మిక శుభారంభం ఆగమ శాస్త్ర సంప్రదాయాలకు అనుగుణంగా ముందుగా హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అర్చకులు భూమిపూజ ప్రదేశాన్ని సంప్రోక్షణ చేసిన అనంతరం వేద మంత్రోచ్చారణల మధ్య భూమిపూజ నిర్వ హించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో ఆయన తనయుడు తుమ్మల యుగంధర్ కృషి ఫలితంగా 30 వేలకు పైగా భక్త జనం వచ్చినా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు.. కార్యక్రమం ముందు ఐదు రోజులు ముందు నుండి తుమ్మల యుగంధర్ దేవాలయ శంకుస్థాపన పనులను దగ్గరుండి పర్యవేక్షించడం ఏర్పాట్లు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా స్పీడ్ అప్ చేయడంతో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం శంకుస్థాపన పనులు శరవేగంగా జరిగాయి.

మంత్రి తుమ్మల,శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి,టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు లకు స్వాగతం పలకడం దగ్గర నుండి కార్యక్రమం అయ్యే వరకూ తుమ్మల యుగంధర్ పనితీరు గురించి పలువురు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుమ్మల యుగంధర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ యువనాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.