Khammam: ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన!
Khammam: ఖమ్మంలో టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి చిన్నజీయర్ స్వామి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా శంకుస్థాపన జరిగింది.
Khammam: ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన!
ఖమ్మం: ఖమ్మం నగరంలోని అల్లిపురం కొత్తగూడెం ప్రాంతంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటే శ్వరస్వామివారు ఖమ్మంలో కొలువుదీరేం దుకు తొలి అడుగు పడింది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో శ్రీవారి దివ్యాలయ నిర్మాణానికి టీటీడీ సోమవారం శ్రీకారం చుట్టింది. వేద మంత్రోచ్చారణలు,మంగళవాయిద్యాల నడుమ శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారు శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వ హించారు.
ఈ పవిత్ర కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వ రరావు పాల్గొన్నారు. వేదమంత్రాల సాక్షిగా ఆధ్యాత్మిక శుభారంభం ఆగమ శాస్త్ర సంప్రదాయాలకు అనుగుణంగా ముందుగా హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అర్చకులు భూమిపూజ ప్రదేశాన్ని సంప్రోక్షణ చేసిన అనంతరం వేద మంత్రోచ్చారణల మధ్య భూమిపూజ నిర్వ హించారు.
ఈ పవిత్ర ఘట్టం అనంతరం శ్రీ శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామివారితో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శ్రీవారి ఆలయ నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరిం చారు.ఖమ్మం ప్రాంత భక్తులకు శ్రీవారి దివ్య దర్శన భాగ్యాన్ని చేరువ చేయడంతో పాటు, సనాతన ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయాలనే లక్ష్యంతో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు.సుమారు 40 వేల మంది ఖమ్మం ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఆద్యాత్మిక శోభ వెల్లివిరిసింది.
ఖమ్మం అర్బన్ మండలం, దరుసులాపురం
రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబరు 408/2లో తెలంగాణ ప్రభుత్వం ఆలయ నిర్మాణం కోసం 20.04 సెంట్ల భూమిని కేటాయించింది. ఈ భూమికి రక్షణగా ప్రహరీ గోడ నిర్మాణం కోసం టీటీడీ రూ.3.40 కోట్లు మంజూరు చేసింది. అవస రమైన నిధులతో ప్రధాన ఆలయ నిర్మాణ పనులను టిటిడి చేపట్టనుంది.
ఖమ్మంలో నిర్మించనున్న ఈ దివ్యక్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంతో పాటు ఉపాలయాలు, రాజగో పురం, పోటు (వంటశాల), ప్రాకారం తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. ఆలయ నిర్మాణం పూర్తయితే ఖమ్మం ప్రాంత భక్తులకు శ్రీవారి దర్శనం మరింత చేరువ కావడంతో పాటు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధార్మిక ప్రచారానికి ఈ క్షేత్రం ప్రధాన కేంద్రంగా నిలవనుంది.
కార్యక్రమంలో భాగంగా శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామివారు ఖమ్మం ప్రజలకు మంగళాశాసనాలు అందిస్తూ, ఖమ్మం నగరం రెండు తెలుగు రాష్ట్రాలను ఆధ్యాత్మికంగా అనుసంధానించే కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. శ్రీనివాసుడి కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి ఒక్కరూ ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అరిష్టాలు తొలగి, పాడిపంటలతో పల్లెలు సుభిక్షంగా వర్ధిల్లాలని ఆశీర్వదించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి
సహ కరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తన ఆహ్వానం మేరకు కార్యక్రమా నికి విచ్చేసిన చిన్నజీయర్ స్వామివారికి, సహకరించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి ధన్యవాదాలు తెలియజేశారు. దేవ దేవుడి ఆశీస్సులతో నిర్మితమయ్యే ఈ ఆలయం ఖమ్మం నగరానికి ఆధ్యాత్మిక రెడ్డి, సూపరింటెండెంట్ మల్లికార్జున, అర్చకులు, పలువురు అధికారులు, సిబ్బంది శోభను తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, ఆలయ డిప్యూటీ ఈవో శివప్రసాద్, ఎస్ఈ ఇన్చార్జి ఎస్. ప్రసాద్, డీఈ సురేంద్ర నాథ్ పాల్గొన్నారు.




