Khammam: జేఏసీలో చేరికపై టీఎన్‌జీఓఎస్ నాయకులను కలిసిన సాంస్కృతిక సారథి
Khammam: ఖమ్మంలో టీజీఈజేఏసీలో చేరిక కోసం టీఎన్‌జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావును కలిసిన సాంస్కృతిక సారథి ప్రతినిధులు. సానుకూల స్పందన.
Khammam: జేఏసీలో చేరికపై టీఎన్‌జీఓఎస్ నాయకులను కలిసిన సాంస్కృతిక సారథి
ఖమ్మం: తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) లో తెలంగాణ సాంస్కృతిక సారథి ఎంప్లాయిస్ అసోసియేషన్ ను చేర్పించుటకై ఖమ్మం జిల్లాTSS అధ్యక్షులు పాగి వెంకన్న, ప్రధాన కార్యదర్శి బొమ్మెర ముత్యం, వారి ఆధ్వర్యంలో JAC చైర్మన్ TNGO జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు గారిని JAC లో చేర్పించుట కొరకై మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది.
ఇట్టి విషయంపై స్పందిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కాలికి బలపం కట్టుకొని, తెలంగాణ ఆకాంక్షను ప్రతి పల్లె పల్లెకి తమ కళారూపాల ద్వారా తీసుకెళ్లి చైతన్య పరిచిన ఉద్యమ కళాకారులు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న కళాకారులు మీరు కావున టీఎన్జీవోస్ రాష్ట్ర కమిటీ ఆదేశానుసారంగా జేఏసీలో కలుపుకుంటామని సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో టిఎస్ఎస్ జిల్లా కమిటీ సలహాదారులు మిమిక్రీ సుధాకర్ రావు *, ఉపాధ్యక్షులు *పరకాల అజయ్, * సహాయ కార్యదర్శి నకిరి కంటి వెంకట్, కోశాధికారి చాపలమడుగు కోటేశ్వరరావు*టీఎన్జీవో నాయకులు జైపాల్, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర రమేష్ , శ్రీకాంత్, బుర్రి వెంకటేశ్వర్లు,తదితర నాయకులు తో పాటు, టిఎస్ఎస్ కళాకారులు కాలకట్ట జాన్, వెంగళ కుమారి, మునగాల వెంకటరత్నం, బీరెల్లి రమణ, పమ్మి రవి,తదితరులు కలవడం జరిగింది.




