Khammam: ధంసలాపురం చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి రూట్ మ్యాప్!

Khammam: ఖమ్మం ధంసలాపురం చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి ట్రాఫిక్ మార్గాలు విడుదల. నిమజ్జనం వాహనాల రాకపోకలపై పోలీసుల కీలక సూచనలు, వన్ వే నిబంధనలు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 21 Sept 2026 1:17 PM IST
Khammam
X

Khammam: ధంసలాపురం చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి రూట్ మ్యాప్!

Khammam: ఖమ్మం అర్బన్ మండలం ధంసలాపురం చెరువు వద్దకు విగ్రహాలు చేరుకునేందుకు మార్గాలు రూరల్ మండలం నుంచి, రాపర్తి నగర్,బీసీ కాలనీ, కూరగాయల మార్కెట్, ఆర్ఆర్ స్కూల్ ఏరియా, కొత్త బస్టాండ్ ఏరియా, సాయిబాబా ఆర్చ్, ఆర్టిఏ ఆఫీస్ ఏరియా, బ్యాంక్ కాలనీ, వికలాంగుల కాలనీ, బల్లేపల్లి,ఖానాపురం టేకులపల్లి,న్యూ విజన్ కాలేజ్ పైపు నుండి వచ్చే గణేష్ విగ్రహాలు బైపాస్ ద్వారా ఎన్టీఆర్ సర్కిల్ కి చేరుకొని, అక్కడి నుండి ఇల్లందు ఎక్స్ రోడ్, గవర్నమెంట్ హాస్పిటల్ జడ్పీ సెంటర్,చెరువు బజార్ బోనకల్ ఎక్స్ రోడ్, చర్చి కాంపౌండ్, ముస్తాఫ్ నగర్ సంబానినగర్, రాఘవ మెడికల్స్, శ్రీరామ్ హిల్స్, ధంసలాపురం చెరువుకి వెళ్లేదారి గుండా నిమజ్జనం పాయింట్ కి చేరుకోవాలి.

పంపింగ్ వెల్ రోడ్, గాంధీనగర్, మోతీనగర్, పిఎస్ఆర్ రోడ్, గాంధీచౌక్ సారధినగర్, బొక్కలగడ్డ నుండి వచ్చే వాహనాలు నయాబజార్ నుండి జూబ్లీ క్లబ్ మయూరి సెంటర్, మామిళ్లగూడెం, బురాన్ పురం, బస్ డిపో ఏరియా, కమాన్ బజార్, కస్బా బజార్ నుండి వచ్చే వాహనాలు కిన్నెరసెంటర్, జడ్పీ సెంటర్, చెరువు బజార్ , చర్చి కాంపౌండ్ మీదుగా నిమజ్జనం పాయింట్ కు చేరుకోవాలి.

శ్రీ శ్రీ సర్కిల్, శ్రీ నగర్ కాలనీ, రోటరీ నగర్, ఇందిరానగర్, పాత మమతా మెడికల్ కాలేజీ, మమత ఎక్స్ రోడ్, కవి రాజు నగర్, పాత కలెక్టరేట్ బ్యాక్ గల విగ్రహాలు గట్టయ్య సెంటర్, బ్యాంక్ కాలని,వీడియోస్ కాలనీ నుండి వచ్చే వాహనాలు ఇల్లందు ఎక్స్ రోడ్డు నుండి జడ్పీ కి చేరుకొని చర్చి కాంపౌండ్ ద్వారా నిమజ్జనం పాయింట్ కి చేరుకోవాలి.

వెంకటగిరి ఎక్స్ రోడ్, శ్రీనివాస నగర్, గ్రేయిన్ మార్కెట్ ఏరియా, ప్రకాష్ నగర్, గుట్టల బజార్, జహీర్ పుర తండా, అయ్యప్ప స్వామి టెంపుల్ ఏరియా విగ్రహాలు మొత్తం మెయిన్ రోడ్డు ద్వారా చర్చి కాంపౌండ్ కి చేరుకొని అక్కడి నుండి నిమజ్జనం పాయింట్ కి చేరుకోవాలి.

గొల్లగూడెం మధురానగర్ రాఘవయ్య నగర్ మమతా కాలేజ్, హార్వెస్ట్ స్కూల్ ఏరియా, అల్లిపురం, కొత్తగూడెం, అల్లిపురం ఎక్స్ రోడ్డు నుండి వచ్చే విగ్రహాలు టాటా మోటార్స్ ద్వారా చెరువు బజార్, చర్చి కాంపౌండ్ ద్వారా నిమజ్జనం పాయింట్ కు చేరుకోవాలి.

బోనకల్ ఎక్స్ రోడ్, చర్చి కాంపౌండ్, పోలీస్ హెడ్ క్వార్టర్స్, మిషన్ హాస్పిటల్ ఏరియా, ముస్తఫా నగర్, సంబాని నగర్, పరికముక్కల కాలనీ, శ్రీరామ్ నగర్, శ్రీరామ్ హిల్స్ నుండి వచ్చే విగ్రహాలు మెయిన్ రోడ్డు ఎక్కి నిమజ్జనం పాయింట్ కు చేరుకోవాలి.

తిరుగు ప్రయాణం

నిమజ్జనం అనంతరం ప్రజలు, వాహనాలు నిమజ్జనం పాయింట్ నుండి జయశంకర్ విగ్రహం వరకు చేరుకొని ప్రకాష్ నగర్, శ్రీనివాస్ నగర్, జహీర్ పుర తండా, అయ్యప్ప టెంపుల్, వెంకటగిరి ఎక్స్ రోడ్ వైపు వెళ్లేవారు ధంసలాపురం బ్రిడ్జిని దాటి బ్రిడ్జి కింది నుండి ధంసలాపురం ఊర్లో నుండి ఎస్వీఎం స్కూల్ మీదుగా శ్రీనివాస నగర్, అయ్యప్ప టెంపుల్, ప్రకాష్ నగర్ వైపు వెళ్లి మెయిన్ రోడ్డు ద్వారా వారి గమ్యస్థానాలకు వెళ్ళవచ్చు.

ముస్తఫా నగర్, మమతా రోడ్, ఇల్లందు ఎక్స్ రోడ్, ఎన్టీఆర్, బల్లేపల్లి మామిళ్లగూడెం, న్యూ బస్టాండ్ రాపర్తి నగర్, రూరల్ పైపు వెళ్లేవారు జయశంకర్ విగ్రహం దగ్గర నుండి శ్రీరామ్ హిల్స్, రాఘవ మెడికల్స్ దగ్గర రోడ్ క్రాస్ చేసి పరికముక్కల కాలనీ ద్వారా అల్లిపురం ఎక్స్ రోడ్డుకు చేరుకొని అక్కడి నుండి టాటామోటార్స్, లకారం, మమత ఎక్స్ రోడ్డుకు చేరుకొని ఇందిరానగర్, శ్రీశ్రీ ద్వారా బైపాస్ కు చేరుకొని వారి గమ్యస్థానాలకు వెళ్ళవచ్చు.

వినాయక నిమజ్జనం అనంతరం బయటకు వెళ్లే దారులను కేవలం వన్ వే ట్రాఫిక్ మాత్రమే అనుమతిస్తామని, ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.