Khammam: ఖమ్మం టౌన్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ సునీల్ దత్!
Khammam: ఖమ్మం టౌన్ ఏసీపీ కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వార్షిక తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారం, శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Khammam: ఖమ్మం టౌన్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ సునీల్ దత్!
ఖమ్మం: ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ పరిపాలనను మరింత పటిష్టం చేయడం, విధుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఖమ్మం టౌన్ ఏసీపీ కార్యాలయాన్ని బుధవారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ రికార్డులు, కేసుల వివరాలు, నిర్వహణకు సంబంధించిన రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతి, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, పోలీస్ స్టేషన్ల పనితీరుపై సమీక్షించారు.
ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు పలు సూచనలు చేస్తూ, కేవలం కార్యాలయ స్థాయిలోనే కాకుండా క్షేత్రస్థాయిలోనూ పోలీస్ స్టేషన్ వారీగా సమగ్ర సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితి, నేరాల తీరు, పెండింగ్ కేసులు, ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల పరిష్కారంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతో పాటు నేర నియంత్రణ, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసుల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు.
అనంతరం ఏసీపీ కార్యాలయ ఆవరణలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని చాటిచెప్పారు. కార్యక్రమంలో ఏసీపీ రమణమూర్తి, ఇన్స్పెక్టర్లు సాధిక్ పాషా, రామకృష్ణ, చిట్టిబాబు, నాగరాజు,కరుణాకర్ పాల్గొన్నారు.




