Khammam: ఉద్యమకారుల అరెస్టులు ప్రజాస్వామ్యానికి మచ్చ: కృష్ణారావు!
Khammam: తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఖండించింది. హామీలు నెరవేర్చకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని డా. కె.వి. కృష్ణారావు హెచ్చరించారు.
Khammam: ఉద్యమకారుల అరెస్టులు ప్రజాస్వామ్యానికి మచ్చ: కృష్ణారావు!
ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడని ఉద్యమకారులను హౌస్ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి డా. కె.వి. కృష్ణారావు పేర్కొన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులతో భయభ్రాంతులకు గురిచేయడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని అన్నారు.
ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై ఈ నెల 26వ తేదీలోపు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ డిమాండ్ పిలుపు మేరకు సీఎం ఇంటి ముట్టడి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మొత్తం మీద ఉద్యమకారులను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను తక్షణమే వేగవంతం చేసి, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు, ఆందోళనలు చేపట్టి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పగడాల నరేందర్, లింగానబోయిన సతీష్, డో కుపర్తి సుబ్బారావు, రెడ్డబోయిన వరలక్ష్మి, కామని అనంత లక్మి, స్వరూప రెడ్డి, కమలమ్మ, ధన లక్మీ, యాక లక్ష్మీ తదితరులు ఉన్నారు.




