Khammam: ఖమ్మంలో అక్రమ టపాసులపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు!

Khammam: ఖమ్మం బుర్హన్‌పురంలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.1.75 లక్షల విలువైన దీపావళి టపాసులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని టూ టౌన్ పీఎస్‌కు అప్పగించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 6 Nov 2026 6:43 PM IST
Khammam
X

Khammam: ఖమ్మంలో అక్రమ టపాసులపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు!

ఖమ్మం: దీపావళి పండుగ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా టపాసులు నిల్వ ఉంచి విక్రయించే వారిపై ఖమ్మం పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఖమ్మం నగరంలోని బుర్హన్ పూరం లోని నాగ వెంకటసాయి కిరాణా దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులపై టాస్క్‌ఫోర్స్ సిఐ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి సుమారు 1,75,000/- వేల రూపాయల విలువైన టపాసులను స్వాధీనం చేసుకొని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు.

ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతులు లేకుండా టపాసులను నిల్వ ఉంచడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ప్రమాదం కలిగించే విధంగా నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దీపావళి పండుగను ప్రజలందరూ సురక్షితంగా జరుపుకోవాలని, అనుమతులు కలిగిన విక్రయ కేంద్రాల నుంచే టపాసులు కొనుగోలు చేయాలని సూచించారు. అక్రమ టపాసుల నిల్వలు, విక్రయాలపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.