Khammam: రౌడీ గ్యాంగ్ పేరుతో పోస్టులు.. యువకుడిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్!
Khammam: రౌడీ గ్యాంగ్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో బెదిరింపు పోస్టులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న తెల్లపొట్ట మురళి కృష్ణను ఖమ్మం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
Khammam: రౌడీ గ్యాంగ్ పేరుతో పోస్టులు.. యువకుడిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్!
ఖమ్మం: తల్లాడ మండలం పినపాక గ్రామానికి చెందిన తెల్లపొట్ట మురళి కృష్ణ అనే వ్యక్తి తనకు తానుగా రౌడీ గా చిత్రీకరించుకొని రౌడీ గ్యాంగుల పేరుతో చలామణి అవుతూ, ఇన్‌స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో భయభ్రాంతులకు గురిచేసే విధంగా పోస్టులు పెడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న వ్యక్తిని ఖమ్మం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.
ప్రస్తుతం ఖమ్మం బస్ డిపో నివాసం ఉంటున్న మురళి కృష్ణ ను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం టూ టౌన్ పోలీసులకు అప్పగించారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని రౌడీయిజాన్ని ప్రదర్శించడం, ప్రజలను భయపెట్టేలా పోస్టులు చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఖమ్మం టూ టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ హెచ్చరించారు.




