Khammam: ఖమ్మం బాలపేట శివారులో పేకాట శిబిరంపై దాడి
Khammam: ఖమ్మం బాలపేట శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.10,400 నగదు, 3 ఫోన్లు స్వాధీనం: ఏసీపీ సత్యనారాయణ.
Khammam: ఖమ్మం బాలపేట శివారులో పేకాట శిబిరంపై దాడి
ఖమ్మం: ఖమ్మం ఖానాపురం హవెలి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలపేట గ్రామ శివారులో ఖాళీ ప్రదేశములో కొంతమంది వ్యక్తులు డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ ఉదయ్ కుమార్ ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బంది వెళ్ళి దాడి చేయగా పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ కు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు.
మరో ఇద్దరు పరారీ ఉన్నట్లు పేర్కొన్నారు. వారి నుండి 10,400/- నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో ఎస్ కె. రఫీ,షేక్ హుసేన్,మొగిలి ఉపేందర్,మడ్దనపు సత్యనారాయణ, లకావత్ బాలు,జరాల రమేష్ (పరారీ లో వున్నారు),చల్ల అశోక్ (పరారీ లో వున్నారు)




