Khammam: తల్లాడ గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు!
Khammam: ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామంజవరం సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని వెనకనుంచి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో 14 మంది గాయపడ్డారు.
Khammam: తల్లాడ గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు!
ఖమ్మం: ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామంజవరం గ్రామ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని వెనకనుంచి ట్రావెల్స్ బస్సు. ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న డ్రైవర్ తో పాటు నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి మరో పదిమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
హైదరాబాదు నుంచి కాకినాడకు వెళ్తున్న మోజో ట్రావెల్స్ బస్సు తల్లాడ మండలం రామంజవరం గ్రామం సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవేపై.లారీ డ్రైవర్ నిద్రమత్తులో రైలింగ్ ఢీకొని లారీ మధ్యలో నిలిచిపోవడంతో ఆగి ఉన్న లారీని వెనకనుంచి అతివేగంగా ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సంఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న తల్లాడ ఎస్సై వెంకటేష్ పోలీస్ సిబ్బంది గాయపడ్డ ప్రయాణికులను అంబులెన్స్ లో కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాద సంఘటనపై తల్లాడ ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేశారు.




