Khammam: ఖమ్మంలో ఘనంగా 'పోషణ అభియాన్' కార్యక్రమం..హాజరైన సుడా చైర్మన్!

Khammam: ఖమ్మం వెంకటాయపాలెం రైతు వేదికలో పోషణ అభియాన్, శ్రీమంతం, అన్నప్రాశన వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 7 Oct 2026 2:05 PM IST
Khammam
X

Khammam: ఖమ్మంలో ఘనంగా 'పోషణ అభియాన్' కార్యక్రమం..హాజరైన సుడా చైర్మన్!

.Khammam: తెలంగాణ ప్రభుత్వం ఐసీడీఎస్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వెంకటాయపాలెం గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన పోషణ అభియాన్ – శ్రీమంతం మరియు చిన్నారుల అన్నప్రాశన కార్యక్రమానికి ఖమ్మం SUDA చైర్మన్ శ్రీ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు

ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు పోషకాహారం,ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యంతో పాటు గర్భంలోని శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సమతుల్య ఆహారం, వైద్యుల సూచనలు, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు ఎంతో అవసరమని తెలిపారు. గర్భిణీలు,బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, వైద్య సేవలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అలాగే చిన్నారుల అన్నప్రాశన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించి, చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. శిశువుల తొలి దశ నుంచే సరైన పోషకాహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక ఎదుగుదలకు బలమైన పునాది ఏర్పడుతుందని పేర్కొన్నారు. చిన్నారులకు వయస్సుకు తగిన పోషకాహారం, టీకాలు, ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా అందేలా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, ఆరోగ్య అవగాహన, చిన్నారుల ప్రాథమిక అభివృద్ధి వంటి సేవలను అందిస్తోందని తెలిపారు. సమాజంలో ప్రతి తల్లి, ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండేలా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు గ్రామ సర్పంచ్ శ్రీ కాపా ఆదినారాయణ గారు, జిల్లా మహిళా అధ్యక్షురాలు సౌజన్య గారు, ముఖ్య నాయకులు కిలారి అనిల్ , వీరభద్రం, బొందయ్య, గంగరాజు, రాజు గౌడ్ బాలాజీ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

అలాగే ఐసీడీఎస్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది, వైద్యులు, సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు, తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.