Khammam: ఖమ్మం వాసి మోతుకూరి అశోక్‌కు బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అవార్డు!

Khammam: ఖమ్మం వాసికి అరుదైన గౌరవం ఎక్స్‌పో భరత్ కళా పురస్కార్స్‌లో ‘ది బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్’ అవార్డు గెలుచుకున్న మోతుకూరి అశోక్ కుమార్ శంషాబాద్‌లో ఘన సత్కారం.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 3 Oct 2026 7:16 PM IST
Khammam
X

Khammam: ఖమ్మం వాసి మోతుకూరి అశోక్‌కు బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అవార్డు!

ఖమ్మం: ఇటీవలే ఉభయ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ సంయుక్తంగా నిర్వహించిన ఫోటోగ్రఫీ అవార్డు లలో ది బెస్ట్ వెడ్డింగ్ ఫోటో గ్రాఫర్ అవార్డు ను మాజీ తెలంగాణ ఫోటోగ్రాఫైర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ చే ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్ శంషాబాద్ , హైదరాబాద్ లో జరిగిన ఎక్సపో భరత్ కళా పురస్కార్ అవార్డ్స్ - 2026 ను ఖమ్మం రూరల్ మండలం , ఆరెంపుల గ్రామానికి చెందిన శ్రీ మోతుకూరి అశోక్ కుమార్ అందుకున్నారు . ఈ సందర్భంగా వారిని ఎక్సపో భరత్ కళా పురస్కార్ అవార్డ్స్ తో సత్కరించారు.

ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ నాయకులు బంధుమిత్రులు మరియు శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు . ఇలాంటి అవార్డులను మరెన్నో అందుకోవాలని ఆకాంక్షించారు . గతంలో కూడా పలు జాతీయ స్థాయి ఫోటో వర్కుషాప్ లో వివిధ రాష్ట్రాల నుంచి 35 మంది ఫోటోగ్రాఫర్లు పాల్గొన్న వర్కుషాప్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ ఫ్యాకల్టీ ఖమ్మం కు చెందిన హుసేన్ ఖాన్ నిర్వహించైన కేరళ సంప్రదాయ కళలైన కథాకళి , తెయ్యం , కడియారపట్టు , ట్రావెలింగ్ అంశాలపై జరిగిన ఫోటో వర్క్ షాప్ లో పాల్గొని స్పాట్ కాంపిటీషన్ లో బహుమతి కూడా గెలుచుకున్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.