Khammam: వైరా కమ్మ సంఘం వనసమారాధనలో పాల్గొన్న పువ్వాడ అజయ్

Khammam: ఖమ్మం జిల్లా అభివృద్ధిలో కమ్మ సామాజిక వర్గ పాత్ర ఎంతో కీలకమని వైరా కమ్మ సంఘం కార్తీక వనసమారాధనలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 15 Nov 2026 7:33 PM IST
Khammam
X

Khammam: వైరా కమ్మ సంఘం వనసమారాధనలో పాల్గొన్న పువ్వాడ అజయ్

ఖమ్మం: వైరా కమ్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీకమాస వనసమారాధన కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, మాజీ పార్లమెంటరీ పార్టీ నాయకులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ ముందుగా వనసమారాధనకు విచ్చేసిన ప్రజలకు కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఖమ్మం జిల్లాకు రాజకీయంగానే కాకుండా అన్ని రంగాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం, గుర్తింపు లభించడానికి కమ్మ సామాజిక వర్గమే ప్రధాన కారణమని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జనాభా పరంగా చూసినా, వ్యవహారికంగా చూసినా జిల్లాలో అత్యంత ప్రభావశీలమైన వర్గంగా కమ్మ కమ్యూనిటీ నిలిచిందని పేర్కొన్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లోనైనా, నాన్-ఏజెన్సీ ప్రాంతాల్లోనైనా రైతాంగంగా మరియు ఇతర వ్యాపార, సామాజిక రంగాల్లో కమ్మ సామాజిక వర్గం క్రియాశీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, నేటి తెలంగాణలోనూ కమ్మ కమ్యూనిటీ ఉనికి, నాయకత్వ పటిమ ఎంతో బలంగా ఉందన్నారు.

ఖమ్మం జిల్లా బిడ్డగా నామా నాగేశ్వరరావు గారు గతంలో రెండుసార్లు ఎంపీగా, పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేసి జిల్లా గౌరవాన్ని పెంచారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు సమయంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తన తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పాటు, కమ్మ సామాజిక వర్గం మరియు జిల్లా ప్రజల అండదండలతోనే తాను మంత్రిగా పనిచేసే అవకాశం లభించిందని కృతజ్ఞతలు తెలిపారు.

సమాజంలోని అన్ని కులాలు, వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉన్నప్పుడే ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని, వారందరినీ కలుపుకుని పోయే 'ఇరుసు' లాగా కమ్మ కమ్యూనిటీ ఉండాలని ఆకాంక్షించారు. ఎందరో గొప్ప నాయకులను అందించిన ఘన చరిత్ర కలిగిన వైరా కమ్మ సంఘం, భవిష్యత్తులో సేవా కార్యక్రమాల్లో మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో కట్టా కృష్ణార్జున రావు,రమేష్, శేఖర్, నాగేశ్వరరావు, బిక్కసాని జస్వంత్,గొల్లపుడి హరికృష్ణ,మోరంపుడి ప్రసాద్,రాంబాబు మరియు వైరా కమ్మ సంఘం కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.