Khammam: ఖమ్మం ఫొటోగ్రాఫర్ షేక్ నాగుల్ మీరాకు ‘భారత్ కళా పురస్కార్-2026’ అవార్డు!

Khammam: వివాహ ఫొటోగ్రఫీలో విశిష్ట ప్రతిభ కనబరిచిన ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ షేక్ నాగుల్ మీరాకు జాతీయ స్థాయి 'భారత్ కళా పురస్కార్-2026' అవార్డు లభ్యం.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 5 Oct 2026 3:07 PM IST
Khammam
X

Khammam: ఖమ్మం ఫొటోగ్రాఫర్ షేక్ నాగుల్ మీరాకు ‘భారత్ కళా పురస్కార్-2026’ అవార్డు!

Khammam: ఫొటోగ్రఫీ రంగంలో విశిష్ట ప్రతిభ కనబరుస్తూ, ముఖ్యంగా వివాహ ఫొటోగ్రఫీలో తనదైన శైలితో రాణిస్తున్న ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ షేక్ నాగుల్ మీరాకు ప్రతిష్టాత్మక ‘భారత్ కళా పురస్కార్–2026’ అవార్డు లభించింది.

వందే భారత్, పీపుల్స్ పంచాయత్ నెట్‌వర్క్ (PPIN) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను *‘బెస్ట్ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్’*గా ఎంపిక చేసి ఈ పురస్కారంతో సత్కరించారు.

ఫొటోగ్రఫీని కేవలం వృత్తిగా కాకుండా కళగా భావిస్తూ, వివాహ వేడుకల్లోని ప్రతి అందమైన క్షణాన్ని కెమెరాలో అద్భుతంగా బంధిస్తూ నాగుల్ మీరా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన తీసిన ఫొటోలు పలువురి ప్రశంసలు అందుకోవడంతో పాటు ఫొటోగ్రఫీ రంగంలో మంచి పేరు తెచ్చిపెట్టాయి.

ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ తన ప్రతిభను గుర్తించి భారత్ కళా పురస్కార్–2026కు ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో మరింత నాణ్యమైన ఫొటోగ్రఫీ సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఖమ్మం జిల్లాకు చెందిన ఫొటోగ్రాఫర్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం పట్ల ఫొటోగ్రఫీ రంగానికి చెందిన పలువురు, మిత్రులు, శ్రేయోభిలాషులు నాగుల్ మీరాకు అభినందనలు తెలిపారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.