Khammam: పెద్దగోపతి సబ్‌స్టేషన్‌ను పరిశీలించిన సీఎండీ వరుణ్ రెడ్డి!
Khammam: ఖమ్మం జిల్లా పెద్దగోపతి సబ్‌స్టేషన్‌ను టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్ తనిఖీ చేశారు. నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించాలని ఆదేశించారు.
Khammam: పెద్దగోపతి సబ్‌స్టేషన్‌ను పరిశీలించిన సీఎండీ వరుణ్ రెడ్డి!
ఖమ్మం: ఖమ్మం సర్కిల్ పరిధిలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్ శుక్రవారం 220/132/33 కేవీ పెద్దగోపతి సబ్‌స్టేషన్‌ను సందర్శించి విద్యుత్ సరఫరా పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సబ్‌స్టేషన్ పనితీరు, విద్యుత్ సరఫరా స్థితిగతులను పరిశీలించి, ప్రస్తుత డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ అవసరాలకు విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, సాంకేతిక సమస్యలను గుర్తించిన వెంటనే పరిష్కరించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఆదేశించారు.
విద్యుత్ సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉంటూ, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఖమ్మం ఎస్ ఈ శ్రీనివాస చారి, డీఈ ఆపరేషన్స్ వైరా,ఏఈ/ఆపరేషన్స్/పెద్దగోపతి, టీజీ ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




