Khammam: ఖమ్మం కార్పొరేషన్‌లో నానేబియ్యం బతుకమ్మ

Khammam: ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో మెప్మా, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో నాల్గవ రోజు 'నానేబియ్యం బతుకమ్మ' వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 13 Oct 2026 9:32 PM IST
Khammam
X

Khammam: ఖమ్మం కార్పొరేషన్‌లో నానేబియ్యం బతుకమ్మ

ఖమ్మం: ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో నాల్గవ రోజు నానేబియ్యం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో ముడిపడిన జీవన విధానానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పే ఈ వేడుకలు కార్యాలయంలో పండుగ వాతావరణాన్ని నింపాయి.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది, ఉద్యోగులు పాల్గొని బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. గౌరమ్మను కొలిచి ఆట, పాటలతో సందడి చేసారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీచేయనైనది.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.