Khammam: మున్నేరు కేబుల్ బ్రిడ్జి పనుల్లో జాప్యంపై బీజేపీ ఆగ్రహం!
Khammam: ఖమ్మం మున్నేరు కేబుల్ బ్రిడ్జి పనులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు పరిశీలించారు. పనుల్లో జాప్యం వీడి త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
Khammam: మున్నేరు కేబుల్ బ్రిడ్జి పనుల్లో జాప్యంపై బీజేపీ ఆగ్రహం!
ఖమ్మం: ఖమ్మం నగరంలోని మున్నేరు వాగుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి పనులను బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తికాకపోవడం వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఇంజనీర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. బ్రిడ్జి సమీపంలోని ఇళ్లలోకి దుమ్ము, ధూళి చేరకుండా తగిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను కోరారు.
అధికారుల పర్యవేక్షణ లోపాలు, నిర్మాణ జాప్యాన్ని వెంటనే సరిదిద్దుకోవాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుబ్బారావు, డోకుపర్తి రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు రవి రాథోడ్, రాష్ట్ర మోర్చా ఉపాధ్యక్షులు శ్యామ్ రాథోడ్, అనిత, అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, కోశాధికారి కొనతం లక్ష్మీనారాయణ, ఆఫీస్ సెక్రటరీ రవి గౌడ్, సోషల్ మీడియా ఇన్చార్జి కందుల శ్రీకృష్ణ, మోర్చా అధ్యక్షులు ఆర్.వి.ఎస్. యాదవ్, నరుకుల వెంకటేశ్వర్లు, రీగల్ ప్రతాప్, శాసనాల సాయిరాం, ఈదుల వీరభద్రం, వీరభద్ర ప్రసాద్, శ్రీలక్ష్మి, రెడ్డి వెంకటరమణ తదితర నాయకులు పాల్గొన్నారు.




