Khammam: సుడా పార్కును పరిశీలించిన కమిషనర్ అభిషేక్ అగస్త్య!
Khammam: ఖమ్మం జిల్లా రఘునాధపాలెంలోని సుడా పార్కును సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కమిషనర్ అభిషేక్ అగస్త్య పరిశీలించారు. మౌలిక వసతుల కల్పనపై ఆదేశాలు.
Khammam: సుడా పార్కును పరిశీలించిన కమిషనర్ అభిషేక్ అగస్త్య!
Khammam: రఘునాధపాలెం మండలంలో స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుడా పార్కును సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గ ప్రసాద్‌తో కలిసి సుడా వైస్ చైర్మన్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా పార్కులోని మౌలిక వసతులు, పారిశుధ్య నిర్వహణ, సందర్శకులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. పార్కులో ప్రస్తుతం ఉన్న సమస్యలు, అవసరమైన అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఖాదర్ బాబా, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, మాజీ కార్పొరేటర్ కమర్తపు మురళి, శేఖర్ గౌడ్, సేవాదళ్ అధ్యక్షులు గౌస్, సొసైటీ చైర్మన్ పుచ్చకాయల వీరభద్రం, సంబంధిత నాయకులు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




