Khammam: ఘనంగా మున్నూరుకాపు వన సమారాధన మహోత్సవం
Khammam: ఖమ్మంలో మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వన సమారాధన మహోత్సవానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
Khammam: ఘనంగా మున్నూరుకాపు వన సమారాధన మహోత్సవం
ఖమ్మం: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర వన సమారాధన మహోత్సవానికి విచ్చేసిన సందర్భంగా కుల బాంధవులు అపూర్వ స్వాగతం పలికారు.
పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా మున్నూరుకాపు సంఘం ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యాన గొల్లగూడెం రోడ్డులోని చెరుకూరి వారి మామిడి తోటలో వన సమారాధన మహోత్సవం ఏర్పాటైంది.
ఈ మహోత్సవానికి రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీ,పెద్దన్న వద్దిరాజు కిషన్ తో కలిసి విచ్చేసిన సందర్భంగా మున్నూరుకాపులు బాణసంచా కాలుస్తూ,పూలుజల్లుతూ "జై మున్నూరుకాపు జైజై మున్నూరుకాపు","వర్థిల్లాలి వర్థిల్లాలి మున్నూరుకాపుల ఐక్యత వర్థిల్లాలి"అని పెద్ద పెట్టున నినాదాలిస్తూ అపూర్వ స్వాగతం పలికారు.
ఆ తర్వాత వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య వనదేవత,ఉసిరి చెట్టు,పరమ శివుడికి, గోమాతకు పూజలు చేసి వన సమారాధన మహోత్సవాన్ని ప్రారంభించారు.




