Khammam: కూలీల ప్రమాదంపై ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి దిగ్భ్రాంతి!
Khammam: రఘునాథపాలెం మండలం పంగిడి రోడ్డు ప్రమాద ఘటనపై ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు ఆదేశం.
Khammam: కూలీల ప్రమాదంపై ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి దిగ్భ్రాంతి!
ఖమ్మం: ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ గ్రామానికి చెందిన కూలీలు రోడ్డు ప్రమాదానికి గురయ్యారనే విషయం తెలుసుకుని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు.
రఘునాథపాలెం మండలంలోని పంగిడి సమీపంలో పత్తి తీసే పనులకు వెళ్లి ఆటోలో వస్తుండగా లారీ ఢీకొని దొంతు సరుపు భారతమ్మ(55) అనే మహిళ మృతి చెందగా, మరో మహిళ పరిస్థితి విషయమంగా ఉండడం, 12 మంది కూలీలు గాయాల పాలయ్యారనే విషయం తెలుసుకుని..దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.వైద్యాధికారులతో ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు.




