Khammam: రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు అందుకున్న ప్రిన్సిపాల్ సీతా మహాలక్ష్మి!

Khammam: తెలంగాణ రాష్ట్ర మైనారిటీ గురుకులాల విభాగంలో ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలిగా ఎంపికైన ఖమ్మం మైనారిటీ గర్ల్స్-2 ప్రిన్సిపాల్ సీతా మహాలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 12 Nov 2026 1:45 PM IST
Khammam
X

Khammam: రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు అందుకున్న ప్రిన్సిపాల్ సీతా మహాలక్ష్మి!

Khammam: తెలంగాణ రాష్ట్ర మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలల విభాగంలో ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలిగా ఖమ్మం మైనారిటీ గర్ల్స్–2 ప్రిన్సిపాల్ సీతా మహాలక్ష్మి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా 11-11-2026 న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ బంజార భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆమె ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలి అవార్డును అందుకున్నారు.

విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, విద్యా ప్రమాణాల పెంపు, క్రమశిక్షణ, విద్యార్థినుల సమగ్ర అభివృద్ధికి ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.

ఈ పురస్కారంతో ఖమ్మం జిల్లా మైనారిటీ గురుకుల విద్యాసంస్థకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సీతా మహాలక్ష్మికి ఉపాధ్యాయులు, విద్యాసంస్థల సిబ్బంది, విద్యార్థినులు, పలువురు విద్యావేత్తలు అభినందనలు తెలియజేశారు.

విద్యారంగంలో ఆమె అందిస్తున్న సేవలు మరింత మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పలువురు ఆకాంక్షించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.