Khammam: ప్రమాదానికి గురైన ఎస్ఐ జగదీష్‌ను పరామర్శించిన మంత్రి తుమ్మల

Khammam: ప్రమాదంలో గాయపడిన తిరుమలాయపాలెం ఎస్ఐ కూచిపూడి జగదీష్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 5 Oct 2026 4:38 PM IST
Khammam
X

Khammam: ప్రమాదానికి గురైన ఎస్ఐ జగదీష్‌ను పరామర్శించిన మంత్రి తుమ్మల

ఖమ్మం: ఇటీవలే ప్రమాదానికి గురైన తిరుమాలయపాలెం సబ్ ఇన్స్పెక్టర్ కూచిపూడి జగదీష్ గారిని ఈరోజు వారి నివాసం నందు పరామర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు, అనంతరం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి సోదరుడు,తుమ్మల అభిమాని జై చౌదరి గారు,సుడా పువ్వాళ్ల దుర్గాప్రసాద్ గారు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు గారు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ ఖాదర్ బాబా గారు,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ గారు,ఖమ్మం అర్బన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుపాకుల యలగొండ స్వామి గారు,సాధు రమేష్ రెడ్డి గారు, తదితరులు పాల్గొన్నారు

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.