Khammam: 'బాలోత్సవ్-2026' పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి!

Khammam: ఖమ్మంలో నవంబర్ 11, 12న రాష్ట్రస్థాయి బాలోత్సవ్-2026. పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 26 Oct 2026 4:55 PM IST
Khammam
X

Khammam: 'బాలోత్సవ్-2026' పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి!

ఖమ్మం: ఖమ్మం నగరంలో నవంబర్ 11, 12వ తేదీలలో ఖమ్మం డాన్సర్స్ అసోసియేషన్,వారధి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి బాలోత్సవ పోటీలకు సంబంధించిన పోస్టర్లను రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారధి ఫౌండేషన్ చైర్మన్ చింతనిప్పు కృష్ణ చైతన్య తో కలిసి బాలోత్సవ్ -2026 పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మంలో రాష్ట్ర స్థాయి బాలోత్సవ్ పోటీలను నిర్వహించి పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి కృషి చేయడం అభినందనీయమని తెలిపారు. ఉమ్మడి జిల్లా, రాష్ట్రంలోని నలుమూలల నుంచి పిల్లలు ఈ బాలోత్సవంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారధి ఫౌండేషన్ చైర్మన్ చింతనిప్పు ‌కృష్ణ చైతన్య, ఖమ్మం డాన్సర్స్ అసోసియేషన్ (TDA)అధ్యక్షులు రాయల్ నాగరాజు,జిల్లా నాయకులు చిక్కుళ్ల వెంకటేష్, పగిల్లపల్లి రాజు,

RN ప్రసాద్ ,రాజేష్ ,భవాని శంకర్, ముకేశ్,సతీష్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు ,రిజిస్ట్రేషన్ల కోసం cell: 9177630682,8328277244నంబర్స్ ని సంప్రదించగలరని ఆర్గనైజింగ్ కమిటీ తెలియచేసింది.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.