Khammam: రీసర్వే పనులను పకడ్బందీగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్
Khammam: ఖమ్మం జిల్లాలో భూముల రీసర్వే పనులను పకడ్బందీగా, పారదర్శకంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. పలు గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.
Khammam: రీసర్వే పనులను పకడ్బందీగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో భూముల రీసర్వే పనులను పకడ్బందీగా, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం పెనుబల్లి మండలం తుమ్మలపల్లి రెవెన్యూ గ్రామం, కల్లూరు మండలం రఘునాధగూడెం రెవెన్యూ గ్రామం, తల్లాడ మండలం లక్ష్మీపురం రెవెన్యూ గ్రామాల్లో జరుగుతున్న రీసర్వే పనులను అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా గ్రామాల్లో సర్వే పనుల పురోగతిని సమీక్షించి, సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రీసర్వేలో భాగంగా భూముల హద్దులు, విస్తీర్ణం, సర్వే నంబర్లు తదితర వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. భూ రికార్డుల్లోని వివరాలను క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిపోల్చి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నమోదు చేయాలని ఆదేశించారు.
రీసర్వే ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. భూములకు సంబంధించిన వివరాలపై అభ్యంతరాలు లేదా సందేహాలు వ్యక్తమైతే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సర్వే బృందాలు సమన్వయంతో పనిచేస్తూ, నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు రీసర్వే పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, రోజువారీ పురోగతిని సమీక్షించాలని, పనుల్లో జాప్యం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ వెంట తల్లాడ, పెనుబల్లి, కల్లూరు తహశీల్దార్లు కె. కరుణాకర్ రెడ్డి, జి. వీరభద్ర నాయక్, కె. బ్రహ్మశ్వర రావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




