Khammam: ఎల్ నినో కరువు ప్రభావం.. ఖమ్మం వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు!

Khammam: ఎల్ నినో కరువు పరిస్థితుల నేపథ్యంలో ఖమ్మం జీజీహెచ్‌లో ప్రత్యేక హీట్ స్ట్రోక్ వార్డు, 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ రామారావు తెలిపారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 23 Nov 2026 9:09 PM IST
Khammam
X

Khammam: ఎల్ నినో కరువు ప్రభావం.. ఖమ్మం వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు!

ఖమ్మం జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం వలన ఏర్పడిన కరువు పరిస్థితుల నేపథ్యంలో, ప్రభుత్వం మరియు రాష్ట్ర కుటుంబ సంక్షేమ కమిషనర్ & ఎన్‌హెచ్‌ఎం (NHM) ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అన్ని స్థాయిలలో పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టిందని, నీటి ఎద్దడి, వాతావరణ మార్పుల కారణంగా అంటువ్యాధులు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ప్రబలకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రామారావు (DM&HO) తెలిపారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న ముఖ్య చర్యలు:

24/7 ఎపిడెమిక్ కంట్రోల్ రూమ్ & ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు:

జిల్లా కేంద్రంలో నిరంతరం పనిచేసే విధంగా 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, జిల్లా మరియు మండల స్థాయిలలో 'ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్' (RRT) ను పునరుద్ధరించడం జరిగిందని , ఏ ప్రాంతంలోనైనా వ్యాధుల వ్యాప్తి కనిపిస్తే తక్షణమే స్పందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని,

ప్రత్యేక హీట్ స్ట్రోక్ వార్డులు & 108 సేవలు:

తీవ్రమైన ఎండ, వడదెబ్బ బారిన పడే రోగులకు తక్షణ చికిత్స అందించడానికి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH) లో ప్రత్యేకంగా 5 పడకలతో కూడిన హీట్ స్ట్రోక్ మేనేజ్‌మెంట్ వార్డును అన్ని వసతులతో సిద్ధం చేశామని, అలాగే అన్ని '108' అత్యవసర అంబులెన్సులలో కూలింగ్ కిట్స్, ఐ.వి. ఫ్లూయిడ్స్ (IV Fluids) మరియు అత్యవసర జీవన రక్షక మందులు అందుబాటులో ఉంచబడ్డాయని,

ఓ.ఆర్.ఎస్ (ORS) మరియు క్లోరిన్ మాత్రల పంపిణీ:

జిల్లాలోని అన్ని ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (PHCs/UPHCs) సరిపడా మందులు నిల్వ ఉంచబడ్డాయని, క్షేత్రస్థాయి సిబ్బంది అయిన ఏఎన్ఎం (ANM), ఆశా (ASHA), అంగన్‌వాడీ కార్యకర్తల వద్ద ప్రజలకు పంపిణీ చేసేందుకు అవసరమైన పరిమాణంలో ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు మరియు క్లోరిన్ మాత్రలు అందుబాటులో ఉంచడం జరిగిందని,. ప్రతి పీహెచ్‌సీలో ప్రత్యేకంగా ఓ.ఆర్.టి (ORT) కార్నర్ ఏర్పాటు చేయబడుతున్నాయని,

పారిశుద్ధ్యం, క్లోరినేషన్ మరియు దోమల నివారణ:

పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సమన్వయంతో తాగునీటి బావులు, ట్యాంకర్లు, బోరుబావుల వద్ద క్రమం తప్పకుండా క్లోరినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని, డెంగ్యూ, మలేరియా వ్యాధుల నివారణకు ఫాగింగ్, స్ప్రేయింగ్ పనులు వేగవంతం చేయడంతో పాటు ప్రతి శుక్రవారం "ఫ్రైడే - డ్రై డే" (Friday Dry Day) కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నామని,

పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో రోగుల విశ్రాంతి గదులు, ఓపీడీ వెయిటింగ్ హాల్స్‌లో తగినంత చల్లదనం కోసం కూలర్లు, ఫ్యాన్లు, నిరంతర తాగునీటి వసతి మరియు అంతరాయం లేని విద్యుత్ కోసం ఏర్పాటు చేస్తున్నామని,

ప్రజలకు ముఖ్య సూచనలు:

ఐదేళ్ల లోపు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎండలో ఎక్కువగా తిరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,

కాచి చల్లార్చిన నీటిని లేదా క్లోరినేషన్ చేసిన సురక్షితమైన నీటిని మాత్రమే తాగాలని, బయటి, కలుషిత ఆహార పదార్థాలను తినవద్దని,

శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి రోజువారీగా మంచినీరు, ఓ.ఆర్.ఎస్ ద్రావణం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు అధికంగా తీసుకోవాలని,

వాంతులు, విరేచనాలు, తీవ్రమైన జ్వరం లేదా వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలని,

కరువు మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి ప్రజలందరూ ఆరోగ్య శాఖ ఇచ్చే మార్గదర్శకాలను పాటిస్తూ సహకరించాలని కోరడమైనది.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.