Khammam: ఖమ్మంలో ఫుడ్ & కిడ్స్ ఫ్యాషన్ ఫెస్టివల్ 2026
Khammam: ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ పార్క్‌లో అక్టోబర్ 12, 13, 14 తేదీలలో RDIO AI సమర్పణలో ఫుడ్ & కిడ్స్ ఫ్యాషన్ ఫెస్టివల్ 2026 జరగనుంది.
Khammam: ఖమ్మంలో ఫుడ్ & కిడ్స్ ఫ్యాషన్ ఫెస్టివల్ 2026
ఖమ్మం: ఖమ్మం నగరానికి చెందిన RDIO AI సమర్పణలో ఖమ్మం ప్రజల కోసం గ్రాండ్ ఫెస్టివల్ ఈవెంట్ అక్టోబర్ 12, 13 & 14 లలో ప్రతిరోజూ సాయంత్రం 5:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకూ NTR పార్క్, లకారం ట్యాంక్ బండ్, ఖమ్మం. వేదికగా ఉత్సవాలు జరగనున్నాయి..
ఇందులో భాగంగా అండర్-15 కిడ్స్ ఫ్యాషన్ షో ద్వారా మన చిన్నారుల టాలెంట్‌ను ప్రదర్శించేందుకు అద్భుతమైన అవకాశం కల్పించడం ఫ్యాషన్ షోలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ మెడల్ మరియు సర్టిఫికెట్ అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు..
ఈ ఫెస్టివల్‌లో మరెన్నో ప్రత్యేక ఆకర్షణలుగా లైవ్ సింగింగ్ గ్రాండ్ DJ నైట్ అనేక రకాల రుచికరమైన ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు..
ఉచిత ఇన్‌స్టంట్ ఫోటో బూత్స్ మరియు ఎన్నో సర్‌ప్రైజ్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలుతో పాటు అక్టోబర్ 14న ప్రత్యేక ఆకర్షణ బతుకమ్మ పోటీలు జరగనున్నాయి..
మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకునే అవకాశం ఈ కార్యక్రమాల ద్వారా ఖమ్మం ప్రజలకు అందనుంది..
పోటీలలో విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులుగా మొదటి బహుమతి – 5,000
రెండో బహుమతి 3,000
మూడో బహుమతి – 2,000 గా అందించనున్నారు..కార్యక్రమంకు టైటిల్ స్పాన్సర్ గా కూరపాటి చిల్డ్రన్స్ & మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఖమ్మం వారు ఉన్నారని తెలిపారు..
పవర్డ్ బై: OPPO ఆధ్వర్యంలో కార్యక్రమం ఉండనుందని తెలిపారు..
కావున కుటుంబ సమేతంగా విచ్చేసి, రుచులు, ఫ్యాషన్, సంగీతం, సంస్కృతి, వినోదంతో నిండిన ఈ అద్భుతమైన వేడుకలో పాల్గొనగలరనిమనవి..ప్రవేశం ఉచితమని అందరికీ ఆహ్వానం ఉన్న నేపథ్యంలో మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి వచ్చి ఈ మూడు రోజుల వేడుకను విజయవంతం చేయగలరని RDIO AI తరఫున హృదయపూర్వక స్వాగతం పలికారు..




