Khammam: ఖమ్మంలో ఘనంగా డీవైఎఫ్ఐ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకాలు!

Khammam: ఖమ్మంలో ఘనంగా డీవైఎఫ్ఐ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకాలు. జెండా ఆవిష్కరించిన జిల్లా నేతలు బొడ్డు మధు, షేక్ నాగుల్ పాషా. యువత పోరాడాలని పిలుపు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Nov 2026 2:19 PM IST
Khammam
X

Khammam: ఖమ్మంలో ఘనంగా డీవైఎఫ్ఐ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకాలు!

Khammam: ఖమ్మం నగరంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బొడ్డు మధు, జిల్లా అధ్యక్షులు షేక్ నాగుల్ పాషా జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ సమైక్యత, సమగ్రత, లౌకికత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం డీవైఎఫ్ఐ నిరంతరం పోరాడుతోందన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, నాణ్యమైన ఉచిత విద్య అందించాలని కోరారు.

భగత్‌సింగ్ ఆశయాలతో యువత సామాజిక సమస్యలపై చైతన్యవంతమై సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో యువజన, విద్యార్థి సమస్యలపై మరిన్ని ఉద్యమాలు చేపడతామని నాయకులు స్పష్టం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్