Khammam: పంట రుణాల వడ్డీ మాఫీ చేయాలి: రైతు సంఘం నేత దొండపాటి!

Khammam: ఖమ్మం జిల్లాలో పంట రుణాల వడ్డీ మాఫీ చేసి రెన్యువల్ అవకాశం కల్పించాలని, ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని కలెక్టర్‌కు రైతు సంఘం నేతలు వినతిపత్రం ఇచ్చారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 9 Nov 2026 7:06 PM IST
Khammam
X

Khammam: పంట రుణాల వడ్డీ మాఫీ చేయాలి: రైతు సంఘం నేత దొండపాటి!

ఖమ్మం నంబర్ 9: ఏలినీవో ప్రభావం నుండి వ్యవసాయ పంటలు రుణాలను రీ షెడ్యూల్ చేయాలని ప్రభుత్వ ఆలోచన సరైంది కాదని పంట బ్యాంకు ల రుణాల వడ్డీ మాఫీ చేసి రుణ రెన్యువల్ చేసుకునే అవకాశం ప్రభుత్వం ద్వారా కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సోమవారం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా సమితి ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో కలెక్టర్కు వినత పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫానుకు నష్టపోయిన పంటల కు పత్తికి, మిర్చికి 50,000 వరి 30000 పంట నష్టపరిహారం నష్టపోయిన రైతులకు ఇవ్వాలి వర్షపాతం తక్కువ కావడం వల్ల పంటలు వేయని రైతులకు ప్రభుత్వ నుండి ఆర్థిక సహాయం అందించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో పంటల భీమా పథకం ఏర్పాటు చేసి అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని వారు ఆరోపించారు తక్షణమే పంటల భీమా పథకాన్ని ఏర్పాటుచేసి అమలు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు కూరగాయలు పండ్ల తోటలు ధ్వంసం చేస్తున్న కోతుల బెడద నుండి పంటలు రక్షించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర నాయకులు మిడి కంటి వెంకటరెడ్డి జిల్లా రైతు సంఘము వర్కింగ్ ప్రెసిడెంట్ కూచిపూడి రవి జిల్లా రైతు నాయకులు గుమ్మడిల్లి సైదేశ్వర రావు పాతూరి వెంకటేశ్వర్లు నారపోగు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.