Khammam: ఖమ్మం కేసీఆర్ టవర్స్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు..14 మంది అరెస్ట్!

Khammam: ఖమ్మం టేకులపల్లి కేసీఆర్ టవర్స్‌లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, గంజాయికి సంబంధించిన 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 31 Oct 2026 12:18 PM IST
Khammam
X

Khammam: ఖమ్మం కేసీఆర్ టవర్స్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు..14 మంది అరెస్ట్!

Khammam: ఇటీవల కాలంలో టేకులపల్లి లోని కేసీఆర్ టవర్ ప్రాంతంలో కొంతమంది గంజాయి సేవిస్తున్నారని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో ఖమ్మం డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో సిఏఆర్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్, ఈగల్ ఫోర్స్, క్లూస్ టీమ్, మొత్తం 286 మంది పోలీస్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేయడంతో పాటు కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా 52 బ్లాక్ లలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 62 ద్విచక్ర వాహనాలు,5 ఆటోలు స్వాధీనం చేసుకొని స్ధానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదేవిదంగా 105 మంది వేలిముద్రలు తీసుకొని పరిశీలించండం జరిగింది. గంజాయి అమ్ముతున్న ఇద్దరిని, గంజాయి సేవిస్తున్న 12 మంది, 50 గ్రాముల పొడి గంజాయి,ముగ్గురు చోరి నిందితులను, ఇద్దరు అనుమానితులు గుర్తించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. నేరరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.ఈ ప్రాతంలో స్థానిక ప్రజలు కోరుకున్నట్లు పోలీస్ పెట్రోలింగ్ మరింత ముమ్మరం చేస్తామని, బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ మాట్లాడి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ప్రధానంగా యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దు సూచించారు. మీ కుటుంబం కోసం.. మీ పిల్లల భవిష్యత్తు కోసం.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, నేటి మీ అప్రమత్తతే.. రేపటి మీ పిల్లల భద్రమైన భవిష్యత్తన్నారు.

గంజాయి విక్రయదారుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేసి గంజాయి రహిత సమాజ నిర్మాణంలో పోలీసులకు సహకరిస్తూ యువత భవిష్యత్తును కాపాడటంలో భాగస్వాములు కావాలన్నారు.

అదేవిదంగా స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాల వల్ల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై, నేరస్తుల కదలికపై నిరతరం నిఘా ఉంటుందన్నారు. స్దానికంగా ఏలాంటి గొడవలకు పోకుండా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో వుండాలని సూచించారు.

అక్రమ సంపాదనకు అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్న మాయగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. అలాగే ఆన్లైన్ సైబర్ నేరగాళ్ల నుండి అప్రమత్తంగా వుండాలని, మీ బ్యాంక్ ఖాతా వివరాల కోసం వచ్చే కాల్స్, ఈమెయిల్స్ కు స్పందించవద్దని సూచించారు.

ముఖ్యంగా అపరిచితుల పట్ల అప్రమత్తంగా వుండాలని, ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తునట్లయితె స్థానిక పోలీసులకు కాని డయల్ 112కు సమాచారం ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా ఇంటిని అద్దెకు ఇచ్చేటప్పుడు వారి చిరునామా, ఆధార్ కార్డులు చూసిన తరువాతనే ఇంటిని అద్దెకు ఇవ్వాలని స్థానికులకు వివరించారు.

ఇలాంటి అకస్మిక తనీఖీ ద్వారా నేరస్థులను గుర్తించడంతో పాటు నేరాలను నియంత్రించేందుకు దోహదపడుతుందన్నారు. నేరాల నియంత్రణ కోరకు నిరంతరం పోలీస్ పెట్రోలింగ్‌ వాహనాలు , బ్లూకోల్ట్స్‌ సిబ్బంది ఆయా ప్రాంతల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడంతో పాటు పాత నేరస్థుల సమాచారాన్ని సేకరించడం చేస్తారని తెలిపారు.స్ధానిక ప్రజలకు ఎలాంటి అభద్రత భావం లేకుండా ఇలాంటి ఆకస్మికంగా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం,ఏసీపీలు రమణమూర్తి, ఎస్బీ ఏసీపీ మహేష్, సైబర్ క్రైమ్ ఏసీపీ ఫణిందర్, సిసియస్ ఏసీపీ సర్వర్, సిఐలు సాదిక్ పాషా, చిట్టిబాబు, కరుణాకర్, శివప్రసాద్, నాగరాజు, ఆర్ ఐ లు కామరాజు, శ్రీశైలం, సురేష్, పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.