Khammam: ఖమ్మంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి సంబరాలు
Khammam: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఖమ్మంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి జరిపిన డీసీసీ అధ్యక్షుడు దీపక్ చౌదరి, నేతలు.
Khammam: ఖమ్మంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి సంబరాలు
ఖమ్మం: దీపావళి పండుగ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంతింటి కల నెరవేరిన లబ్ధిదారుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి, వారితో కలిసి దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్న ఖమ్మం అర్బన్ డీసీసీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ ఖాదర్ బాబా గారు,
మాజీ మేయర్ శ్రీమతి పూనకల్లు నీరజ గారు, ఓబీసీ సెల్ నగర అధ్యక్షుడు బాణాల లక్ష్మణ్ గారు, వడ్డెబోయిన శ్రీనివాస్ రావు గారు, అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి ఏలూరి శ్రీనివాసరావు గారు, జిల్లా కార్యదర్శి కోనేటి నారాయణ గారు, షేక్ ముజీబ్ గారు, అల్లే సాయి కిరణ్ గారు, 48వ డివిజన్ అధ్యక్షుడు సత్యనారాయణ గారు, మల్లీదు మనీష్ గారు, ఏడు నూతల ప్రభాకర్ రావు గారు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో ఆత్మీయంగా ముచ్చటించి, వారి సంతోషంలో పాలుపంచుకున్నారు. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయి.
ప్రతి పేదింటా ఆనందాల దీపావళి వెలగాలి.. ప్రతి కుటుంబం సొంతింటిలో సంతోషంగా ఉండాలి.. ఇదే ఇందిరమ్మ ప్రభుత్వ ఆకాంక్ష!




