Khammam: ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ: అదనపు కలెక్టర్!
Khammam: ఖమ్మం కలెక్టరేట్‌లో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ముద్దపప్పు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి మహిళా ఉద్యోగులతో కలిసి ఆడారు.
Khammam: ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ: అదనపు కలెక్టర్!
ఖమ్మం, అక్టోబర్ -12: తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకొనే బతుకమ్మ ప్రకృతిని పూజించే గొప్ప పండుగ అని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. కలెక్టరేట్ లో మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖల మహిళా అధికారులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ బతుకమ్మ వేడుకలలో కలెక్టరేట్లోని వివిధ శాఖలలో ఉన్న మహిళలంతా కలిసికట్టుగా పాల్గొన్నారు. ముందుగా గౌరమ్మ తల్లికి పసుపు, కుంకుమ, పూలతో పూజించారు. కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఆట పాటలతో సందడి చేసిన మహిళలు, ఉద్యోగులతో కలిసి అదనపు కలెక్టర్ కలిసి ఆడి వారిని ఉత్తేజపరిచారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించుకుంటున్న బతుకమ్మ పండుగలో తొమ్మిది రోజులు రకరకాలుగా గౌరమ్మను కొలుచుకొంటూ, కలిసి కట్టుగా అందరూ ఒకేచోట చేరి ఆడుతూ, పాడుతూ బతుకమ్మను పూజించుకొంటారని అన్నారు. ఉద్యోగులు, సిబ్బంది అందరూ బతుకమ్మ సంబరాలలో పాల్గొని గౌరమ్మను కొలిచి ఆట, పాటలతో సందడి చేసారు.




