Khammam: రాజ్యాంగ విలువలు, ఆశయాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: అదనపు కలెక్టర్!
Khammam: ఖమ్మం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులు, సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు.
Khammam: రాజ్యాంగ విలువలు, ఆశయాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: అదనపు కలెక్టర్!
ఖమ్మం: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి పాల్గొని, రాజ్యాంగ పీఠికను చదివి, అధికారులు, సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం కల్పించిందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగమే పునాది అని, రాజ్యాంగం నిర్దేశించిన విలువలు, ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవించి, ఆచరించాలని సూచించారు.
భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడంతో పాటు పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వేచ్ఛ, హోదా, అవకాశాల్లో సమానత్వం కల్పించడమే రాజ్యాంగ పీఠిక ప్రధాన లక్ష్యమని అదనపు కలెక్టర్ అన్నారు.
వ్యక్తి గౌరవాన్ని, దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడుతూ సౌభ్రాతృత్వ భావనతో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




