Khammam: వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరణ: కలెక్టర్ దివాకర్

Khammam: ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్ జిల్లాస్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నవంబర్ 10న కవిత కళాశాలలో పోటీలు జరగనున్నాయి.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 6 Nov 2026 7:03 PM IST
Khammam
X

Khammam: వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరణ: కలెక్టర్ దివాకర్

ఖమ్మం: భారత ప్రభుత్వ యువజన సర్వీసులు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, మై భారత్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లాస్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ దివాకర్ టి.యస్ . దేశ యువతను మాదకద్రవ్యాల (డ్రగ్స్) బారిన పడకుండా కాపాడుతూ, వ్యసన రహిత భారతదేశాన్ని (Drug-free India @ 2047) నిర్మించడం. యువత తమ ఆలోచనలు, అభిప్రాయాలను ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తపరిచేందుకు ఈ కార్యక్రమం ఒక మంచి వేదికగా నిలుస్తుంది.

యువతలో పార్లమెంటరీ వ్యవస్థ, రాజ్యాంగ విలువలు, పౌర బాధ్యతలు, దేశ నిర్మాణంలో యువత పాత్రపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం నవంబర్ 10 2026న కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల నందు ఉదయం 09:00 గంటలకు మొదలవుతుంది.

"నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్" అనే అంశంపై తెలుగు/హిందీ/ఇంగ్లీష్ భాషలలో ఉపన్యాస పోటీలు నిర్వహించబడతాయి. 18 నుండి 25 సంవత్సరాల యువతీ యువకులకు పాల్గొనే అవకాశం కలదు. ప్రతి అభ్యర్థికి మూడు నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ రామ్మూర్తి గారు మరియు మై భారత్ జిల్లా యువ అధికారి మద్దుల వెంకట రాంబాబు గారు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.