Khammam: బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి

Khammam: మ్మం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక బాలల ప్రజావాణిలో చిన్నారుల నుంచి 19 దరఖాస్తులు రాగా, తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 16 Nov 2026 9:25 PM IST
Khammam
X

Khammam: బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి

ఖమ్మం: బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణిని సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమంనకు పిల్లలు, వారి తల్లిదండ్రులతో హాజరై జిల్లా కలెక్టర్ కు దరఖాస్తులు సమర్పించారు.

కార్యక్రమంలో మొత్తం 19 అప్లికేషన్స్ రాగా, వాటిని పరిష్కారం కొరకు స్పాన్సర్షిప్ కొరకు జిల్లా సంక్షేమ అధికారిణి కి, ఆధార్, పుట్టిన తేదీ సర్టిఫికెట్స్ కొరకు గాను ఈజిల్లా మేనేజర్, అంగ వైకల్య ధృవీకరణల కొరకు గాను డిఆర్డీఏ పిడి కి, ఫీజు రీయంబర్స్మెంట్ కొరకు గాను జిల్లా విద్యాధికారిణికి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు.

దరఖాస్తులను సంబంధిత శాఖలు సమన్వయం చేసుకోవాలని వెంటనే పరిష్కరించాలని, పరిష్కార చర్యలపై నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, బాలల భద్రత, విద్య, ఆరోగ్యం, పోషణ, హక్కులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోనెలా చర్యలు చేపట్టనున్నట్లు అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి ఏ. ప్రమీల, జిల్లా బాలల పరిరక్షణ అధికారిణి టి. విష్ణువందన, కార్మిక అధికారిణి వెంగమాంబ, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డా. లక్ష్మీనారాయణ, సి.సి.ఆర్బి. సి.ఐ. రమేష్, డి.సి.పి.యూ. సిబ్బంది సోనీ, యశోద, శ్రీ లక్ష్మీ, నిరోషా, స్రవంతి, సందీప్, హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.