Kalluru: కల్లూరులో బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం!
Kalluru: ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. అర్హులంతా ఓటరుగా నమోదు కావాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పిలుపు.
Kalluru: కల్లూరులో బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం!
Kalluru: రానున్న ఖమ్మం–నల్గొండ–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కల్లూరులోని వీకేఆర్ కన్వెన్షన్ హాల్‌లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, ముఖ్య నేతలు,బూత్ ఏజెంట్లతో బూత్ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.
ప్రతి గ్రామం, ప్రతి మండలంలో బూత్ ఏజెంట్లు చురుకుగా వ్యవహరిస్తూ అర్హులైన గ్రాడ్యుయేట్లను గుర్తించి, వారికి ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి అర్హులైన ఓటరు నమోదు కాకుండా మిగిలిపోకుండా నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తూ పార్టీ కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని సండ్ర వెంకట వీరయ్య గారు పిలుపునిచ్చారు.
అనంతరం కల్లూరు మాజీ జడ్పిటిసి సభ్యులు కట్టా అజయ్ కుమార్ మాట్లాడుతూ, రాబోయే వరంగల్ ,ఖమ్మం ,నల్గొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి పట్టభద్రులు మద్దతు ఇవ్వాలని మాజీ జడ్పిటిసి సభ్యులు కట్టా అజయ్ కుమార్ పిలుపునిచ్చారు అనంతరం కల్లూరులో వికేఆర్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఓటర్గా నమోదు చేసుకోవాలని సూచించారు
2026 నవంబర్ 6 వరకు ఫారం 18 దరఖాస్తులు స్వీకరించిన ఉన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించిన నేపథ్యంలో అర్హత ఉన్నవారు గడువులోగా నమోదు చేసుకోవాలని కోరారు 2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసి 2026 నవంబర్ 1 నాటికి మూడేళ్లు పూర్తయిన పొట్టబద్ధలు అర్హులని అధికారులు ప్రకటనలో పేర్కొన్నట్లు తెలిపారు గతంలో ఎమ్మెల్సీ ఓటర్గా నమోదు చేసుకున్న వారు సైతం కొత్తగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు ప్రస్తుత ప్రభుత్వం నిరుద్యోగులు,
ఉద్యోగులు మహిళలకు ఇచ్చిన హామీలు అమలులో పూర్తిస్థాయిలో విఫలమైందని ఆయన ఆరోపించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు నిరుద్యోగులు ఉద్యోగులు రిటైర్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు పట్టబద్రుల హక్కులు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగులు రిటైర్ ఉద్యోగులు సమస్యలను ఎమ్మెల్సీ వేదికగా బలంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉందని అజయ్ కుమార్ పేర్కొన్నారు ప్రతి అర్హుడు ఓటరుగా నమోదు చేసుకుని ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు పాలెపు రామారావు,మాజీ జడ్ పీ టీ సీ సభ్యులు కట్టా అజయ్ కుమార్, డాక్టర్ లక్కినేని రఘు, పుర కౌన్సిలర్లు పెడకంటి రామకృష్ణ, కనపర్తి శ్యామల రాజ్ కుమార్ దంపతులు, ఇస్మాయిల్, రేష్మ ఇంతియాజ్, కళ్యాణపు నవ్య కొండలరావు దంపతులు, దార్ల లక్ష్మీ నరసింహరావు, గ్రామ సర్పంచ్లు వేమకృష్ణ ,జినుగు శ్రీనివాసరావు, దేవరపల్లి భాస్కరరావు ,నాగమల్లేశ్వరరావు, బో బోలు లక్ష్మణ్ రావు, నర్వనేని పెద్దఅంజయ్య, పుసులూరి శ్రీనివాసరావు,కొరకొప్పు ప్రసాద్, శీలంశెట్టికిరణ్, దేవ భక్తిని వీరరాఘవ చౌదరి, బల్లి శెట్టి గోపాల్, కాటేపల్లి రజనీకాంత్, మోర్తాల, పిచ్చిరెడ్డి, కళ్యాణ్ కిషోర్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




