Sathupalli: అయ్యగారిపేటలో రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ!

Sathupalli: సత్తుపల్లి మండలం అయ్యగారిపేటలో రైతు శిక్షణ కార్యక్రమం. రానున్న యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని ఏడీఏ శ్రీనివాస రెడ్డి సూచన.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 9 Oct 2026 7:15 PM IST
Sathupalli
X

Sathupalli: అయ్యగారిపేటలో రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ!

Sathupalli: రానున్న యాసంగి సీజను లో వరి కి బదులుగా ప్రత్యామ్నయ ఆరుతడి పంటల సాగు చేపట్టాలని సత్తుపల్లి సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA) V. శ్రీనివాస రెడ్డి గారు రైతులకు సూచించారు, శుక్రవారం అయ్యగారి పేట గ్రామంలో ఆత్మ పధకము లో భాగము గా ప్రత్యామ్నాయ పంటల సాగు,oilpalm పంటల సాగు, సమతూల్య ఎరువులు, నీటి యాజమాన్యం,కలుపు నివారణ చర్యలు పై జరిగిన రైతు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్నినో నేపద్యం లో లోటు వర్షపాతం , అధిక ఉష్ణోగ్రతలు వలన భూగర్భ జలాలు అడుగంటి పోయే పరిస్థితులు ఉన్నాయని కావున ప్రత్యామ్నాయ ఆరు తడి పంటల సాగు చేయాలని కోరారు.

ఈ రైతు శిక్షణా కార్యక్రమం లో పాల్గొన్న వ్యవసాయ కళాశాల శాస్త్ర వేత్తలు డా.K.నాగాంజలి, డా.P. నీలిమ, డా.M.రామ్ ప్రసాద్ లు మాట్లాడుతూ వ్యవసాయంలో ఆధునిక సాగు పద్ధతులు, వాతావరణ మార్పుల ప్రభావం, పంటల వైవిధ్యీకరణ,ఆరోగ్య పరిరక్షణ, ఆయిల్‌పామ్ సాగు యాజమాన్య పద్ధతులు, వ్యవసాయ శాఖ పథకాలపై రైతులకు శిక్షణ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షులు Ch.కృష్ణయ్య ఉపాధ్యక్షులు G.చెన్నారావు ,బొంతు వేణు మండల వ్యవసాయ అధికారి Y. శ్రీనివాసరావు వ్యవసాయ విస్తరణాధికారులు D. నరేష్, K. ఆశా జ్యోతి, S. అనూష, M. దీప్తి, మరియు రైతులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI