Khammam: ఖమ్మం ఏసీపీ, ఆర్‌అండ్‌బీ అధికారుల సంయుక్త తనిఖీ!

Khammam: కోయచలక, రఘునాథపాలెం రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి, ఆర్ అండ్ బీ అధికారులు ప్రమాదాల నివారణకు తక్షణ రక్షణ చర్యలకు ఆదేశం.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 2 Oct 2026 10:59 PM IST
Khammam
X

Khammam: ఖమ్మం ఏసీపీ, ఆర్‌అండ్‌బీ అధికారుల సంయుక్త తనిఖీ!

ఖమ్మం: ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి , ఖమ్మం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ , ఆర్‌అండ్‌బీ అధికారులు కలిసి రఘునాథపాలెం మండలం కోయచలక గ్రామ శివారులోని కోయచలక–రఘునాథపాలెం రహదారిపై జరిగిన ఫాటల్ రోడ్డు ప్రమాద స్థలాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, రహదారి నిర్మాణం, మలుపులు, ప్రమాదకర ప్రాంతాలు, వాహనాల రాకపోకలు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలాని సంబంధిత అధికారులకు సూచించారు.

రహదారి భద్రతకు సంబంధించిన సమస్యలను గుర్తించి, అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు, రోడ్ మార్కింగ్స్, లైటింగ్ తదితర చర్యలు చేపట్టేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.