Julurupadu: పేద విద్యార్థులకు కమ్మ సంఘం ఆర్థిక చేయూత

Julurupadu: హైదరాబాద్ అమీర్‌పేట కమ్మ సేవా సంఘం సహకారంతో జూలూరుపాడు మండలంలోని ఐదుగురు పేద విద్యార్థులకు రూ.10 వేల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 25 Oct 2026 6:07 PM IST
Julurupadu
X

Julurupadu: పేద విద్యార్థులకు కమ్మ సంఘం ఆర్థిక చేయూత

Julurupadu: మండలంలోని కమ్మ కులానికి చెందిన పదవ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు హైదరాబాద్ అమీర్ పేటకు చెందిన కమ్మ సేవా సంఘం ఆర్థిక సహాయాన్ని అందించింది.

జూలూరుపాడు కమ్మ సేవా సమితి పేద విద్యార్థుల వివరాలను వారికి అందించింది. దీంతో మండలంలోని కాకర్ల, గుండ్లరేవ్, అన్నారపాడు, వెంకన్నపాలెం గ్రామాలకు చెందిన 10వ తరగతి చదువుతున్న నలుగురి విద్యార్థులకు, ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక విద్యార్థికి రూ పదివేల చొప్పున ఒక్కొక్కరికి చెక్కులను సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు పీజీ కృష్ణమూర్తి, దుద్దుకూరు నరసింహారావులు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కమ్మ సంఘం ప్రచార కార్యదర్శి తాళ్లూరి సృజన్ కుమార్ సహకారంతో మండలంలోని పేద కమ్మ విద్యార్థులకు ఆర్థిక సహాయం అమీర్పేట కమ్మ సేవా సంఘం వారి ద్వారా అందినట్లు తెలిపారు. జూలూరుపాడులోని ఆర్కే ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విద్యార్థులకు 50 వేల రూపాయల విలువ చేసే చెక్కులను అందజేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఆళ్ల మధుబాబు, గుండె పిన్ని వెంకటేశ్వర్లు, ఆళ్ల శ్రీనివాసరావు, చావా వెంకటేశ్వరరావు, గాదె కృష్ణయ్య,రాయపాటి వెంకటేశ్వర్లు, వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU