Aswaraopeta: అశ్వారావుపేటలో ఘనంగా కార్తీక వన సమారాధన.. సన్మానాలు

Aswaraopeta: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన జరిగింది. ప్రముఖులకు సన్మానాలు, ఆటపాటలతో సందడి.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 29 Nov 2026 11:07 PM IST
Aswaraopeta
X

Aswaraopeta: అశ్వారావుపేటలో ఘనంగా కార్తీక వన సమారాధన.. సన్మానాలు

అశ్వారావుపేట: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన ఘనంగా జరిగింది. గంగారం ఆయిల్ ఫామ్ తోటలో వన సమాధాన ఏర్పాటు చేసారు. కార్తీకమాసం లో వన భోజనం చేసి కార్తీక దామోదరునికి ఉసిరి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే సర్వ పాపాలు నశించి ఆయుష్ పెరుగుతుందని శివపురాణం చెబుతుంది. భక్తులు భారీ తరలి వచ్చి కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేసారు.

ఈ కార్యక్రమం లో మహిళలు, యువతులు, పిల్లలు భారీగా వచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు ఆటపాటలతో గడిపారు. పెద్దవారు చిన్ననాటి జ్ఞాపకాలు ముచ్చటించుకున్నారు. వివిధ రకాల శాకాహార వంటకాలు తో భోజనం వాడించిన సంఘం బాద్యులు కమ్మవారిలో వివిధ కళల్లో పేరుగాంచిన వ్యక్తులను స్టేజిపై కూర్చోపెట్టి సన్మానించారు.

భగవత్గిత పఠనంలో అవధాన పద్యసూక్తం చేసి గోల్డ్ మెడల్ సాధించిన వినాయక పురం గృహిణి అల్లూరి సునంద గారిని స్టేజిపై సన్మానం చేసారు. తెలంగాణా కమ్మసంఘాల సమాఖ్య రాష్ట్ర కోశాధికారిగా ఉండి కమ్మవారి యాకత్వం కోసం ఎంతో కృషిచేసి ఖమ్మం జిల్లా కోర్ట్ గవర్నమెంట్ ప్లీడర్ పోమోషన్ పొందిన అడ్వకేట్ కండపనేని రత్నాకర్ రావ్ కి సన్మానం చేసారు.

గీత సారాంశాన్ని ఏకధాటిగా ప్రసంగించిన కాసాని దుర్గ గారిని సన్మానం చేసారు. అశ్వారావుపేట వైద్యరంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ నాగేశ్వరావు మృతికి సంతాపం తెలిపి వారి కుమారుడు, కోడలు డాక్టర్స్ ని సన్మానం చేసారు. కార్యక్రమంలో జరిగిన వివిధ ఆటలు పోటిల్లో గెలుపొందున యువతులు, విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసారు. కార్యక్రమం విజయవంతంగా నడిపిన సంఘం అధ్యక్షులు అల్లూరి వెంకట రామారావు ని అభినందనలు తెలిపారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA