Khammam: కల్లూరు మున్సిపాలిటీలో బార్ లైసెన్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం!

Khammam: కల్లూరు మున్సిపాలిటీలో 2బీ బార్ ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం అక్టోబర్ 12 వరకు గడువు, రుసుము రూ.1 లక్ష అని ఖమ్మం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి జానయ్య ప్రకటన.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 28 Sept 2026 6:48 PM IST
Khammam
X

Khammam: కల్లూరు మున్సిపాలిటీలో బార్ లైసెన్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం!

ఖమ్మం, సెప్టెంబర్ -28: తెలంగాణ ఎక్సైజ్ రూల్స్ 2005 ప్రకారం కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఒక (01) 2బి బార్ ఏర్పాటుకు సంబంధించి ప్రియర్ క్లియరెన్స్ మంజూరు కోసం ఆసక్తి ఉన్న వ్యక్తుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి యస్. జానయ్య ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ వారి ఉత్తర్వుల మేరకు ఈ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అన్నారు.

దరఖాస్తు రుసుము ఒక లక్ష రూపాయలు వుంటుందని, దరఖాస్తులు తేదీ: 12.10.2026 లోగా సమర్పించాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వారి కార్యాలయం, ఖమ్మం, ఉప కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ వారి కార్యాలయం, ఖమ్మం, కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ వారి కార్యాలయం, హైదరాబాద్, తెలంగాణ కార్యాలయంలో సమర్పించవచ్చునని తెలిపారు. ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ tgbcl.telangana.gov.in ను చూడగలరని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.