Julurupadu: ఉపాధ్యాయులకు రక్షణ లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం

Julurupadu: నేలకొండపల్లి లెక్చరర్ మృతికి నిరసనగా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం పాఠశాలలో ఎంఈఓ ఝుంకిలాల్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 28 Nov 2026 5:36 PM IST
Julurupadu
X

Julurupadu: ఉపాధ్యాయులకు రక్షణ లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం

జూలూరుపాడు: ఉపాధ్యాయులకి రక్షణ లేని ఈ సమాజంలో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని జూలూరుపాడు మండల విద్యాశాఖ అధికారి జుంకీల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్ పై ఓ విద్యార్థి తీవ్రంగా దాడి చేయడంతో ఆ లెక్చరర్ కు గాయాలయి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఎంతో బాధాకరమన్నారు.

పడమటి నర్సాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ లెక్చరర్ ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది నిజంగా అత్యంత బాధాకరమైన, ఆందోళన కలిగించే సంఘటన ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్ పై ఒక విద్యార్థి తీవ్రంగా దాడి చేసి ఆ లెక్చరర్ మరణానికి కారణం కావడం చాలా దారుణం అన్నారు. సమాజంలో పిల్లల్లో మానవతా విలువలు, నైతిక విలువలు, సామాజిక బాధ్యత, గురువుల పట్ల గౌరవం వంటి అంశాలు ఎందుకు తగ్గిపోతున్నాయనే విషయంపై మనమందరం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మృతి చెందిన అధ్యాపకుని కుటుంబానికి ఎవరు భరోసా కల్పిస్తారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇటువంటి చర్యలు జరగకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలని,విద్యార్థి దాడిలో మృతిచెందిన అధ్యాపకుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి కోరారు.

మృతికి కారణమైన విద్యార్దిని చట్టపరంగా కటినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయుల ప్రభాకర్ రావు ,లింగయ్య, రాణి, రమణమ్మ, రమేష్, సుధాకర్ రెడ్డి,మాన్సింగ్, నర్సింహ, రాందాస్ పాల్గొన్నారు

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU