Julurupadu: జూలూరుపాడులో గురు రవిదాస్ జయంతి వేడుకలు!
Julurupadu: భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో సంత్ రవిదాస్ 650వ జయంతి సందర్భంగా 13 గ్రామాల పెద్దలతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. వివక్ష లేని సమాజమే లక్ష్యమని అప్పాల ప్రసాద్ పేర్కొన్నారు.
Julurupadu: జూలూరుపాడులో గురు రవిదాస్ జయంతి వేడుకలు!
జూలూరుపాడు: సామాజిక సమరసిత వేదికలో సంత్ శిరోమణి గురు రవిదాస్ 650వ జయంతి ఉత్సవాల సందర్భంగా జూలూరుపాడు మండలం వివిధ గ్రామాల గ్రామ పెద్దల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ మార్గదర్శనం చేశారు. జూలూరుపాడు మండలంలోని గ్రామాల నుంచి వచ్చిన వివిధ కుల సంఘాల పెద్దలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అంటరానితనం, వివక్షత గ్రామాల్లో తొలగినప్పుడే జాతీయ సమైక్యతకు అంకురార్పణ జరుగుతుందని అన్నారు.
గ్రామాల్లో పెద్దలు కలసి కూర్చుని దేవాలయాల ప్రవేశం, అన్ని హిందువుల పండుగలు అలానే అన్ని కార్యక్రమాలను ఎలాంటి హింసా ద్వేషాలు లేకుండా జరుపుకోవాలని సూచించారు. నేడు గ్రామాల్లో వివిధ కుల సంఘాల పెద్దలు తమ సామాజిక కుటుంబీకుల అభివృద్ధికి తోడ్పడుతూ వివిధ సామాజిక వర్గాలతో స్నేహభావంతో గ్రామంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. అన్ని సామాజిక వర్గాలతో కలసి ఉండటంగా చేయడం జాతీయ సమైక్యతను ప్రతిబింబిస్తోందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో 13 గ్రామాల నుంచి అన్ని కుల సంఘాల ప్రతినిధులు విచ్చేసి తమ యొక్క అనుభవాలను, గ్రామంలో ఉమ్మడిగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. అప్పాల ప్రసాద్ జి మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ప్రజ అనే నినాదంతో జాతీయస్థాయిలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో అనేక చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.
భారతదేశంలో బ్రిటిష్ వారి రాకకు ముందు కుల వ్యవస్థ అనేది లేకుండా ప్రజలంతా ఉమ్మడిగా తమ తమ వృత్తులతో జీవనోపాధి పొందేవారని వివరించారు. బ్రిటిష్ వారు విభజించి పాలించు అనే పద్ధతిలో భారతదేశంలో కుల వ్యవస్థకు ఆజ్యం పోశారని పేర్కొన్నారు. నేడు యువతలో కుల వివక్షత లేకుండా స్నేహభావంతో ముందుకు సాగుతూ ఒకే దేశం ఒకే ప్రజ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్న యువతను ఈ సందర్భంగా అభినందించారు. కుల పెద్దలు అందర్నీ సాలవాలతో సన్మానం చేసి వారిని అప్పాల ప్రసాద్ జి అభినందించారు.
ఈ కార్యక్రమంలో సంచార యాత్ర రాష్ట్ర అధ్యక్షులు స్వర్ణ కుమార్,, సామాజిక సామరసత వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి, శ్రీరాములు, చిలుకూరి రమేష్, రోకటి రంగారావు, గుండె పిన్ని వెంకటేశ్వర్లు, మద్దిబోయిన నాగరాజు, రామిశెట్టి నాగేశ్వరరావు, , బుడుగు వీరస్వామి, భూక్య రమేష్, తెల్లం నరసింహారావు. వివిధ కుల సంఘ పెద్దలు మరియు తదితరులు పాల్గొన్నారు.




