Julurupad: శిథిలావస్థలో గ్రంథాలయం.. కొత్త భవనం మంజూరు చేయాలి
Julurupad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని శిథిలావస్థకు చేరిన గ్రంథాలయానికి తక్షణమే నూతన భవనం మంజూరు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది.
Julurupad: శిథిలావస్థలో గ్రంథాలయం.. కొత్త భవనం మంజూరు చేయాలి
జూలూరుపాడు: జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న గ్రంథాలయానికి మరమ్మతులు చేపట్టి నూతన భవనాన్ని మంజూరు చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ మండల సమితి ఎంఈఓ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.
సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి గుగులతో వంశీ మాట్లాడుతూ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం పోటీ పరీక్షల నోటిఫికేషన్స్ విడుదల చేసున్న సమయంలో గ్రంధాలయానికి శిధిల వ్యవస్థకు చేరిన గ్రంథాలయానికి మరమ్మతులు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి శిధిలా వ్యవస్థకు చేరిన గ్రంథాలయాన్ని నూతన భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఏజెన్సీ విద్యార్థినిరుద్యోగులు చదువుకోవడానికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న పోటీ పరీక్షలకు నూతన సిలబస్తో కూడిన పుస్తకాలను కొనుగోలు చేసే నిరుద్యోగులకు అందుబాటు తీసుకురావాలని కోరారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి నూతన భవనాన్ని మంజూరు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు బాలాజీ మండల నాయకులు అఖిల్ ,సాయి తేజ ,రాంచరణ్ టీజీ బాలాజీ ,తదితరులు పాల్గొన్నారు.




