Julurpadu: జూలూరుపాడును కరువు ప్రాంతంగా ప్రకటించాలి

Julurpadu: జూలూరుపాడు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 30 Oct 2026 5:19 PM IST
Julurpadu
X

Julurpadu: జూలూరుపాడును కరువు ప్రాంతంగా ప్రకటించాలి

జూలూరుపాడు: జూలూరుపాడు మండలాన్ని తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు బాణోత్ ధర్మ,ఏదులాపురం గోపాలరావు లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌ కార్యాలయంలో ఆర్ఐ గారికి అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎల్ నీనో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, మండలంలో సాగు చేసిన కొద్దిపాటి పంటలు కూడా నీళ్లు లేక ఎండిపోతున్నాయని తెలిపారు. ఈ క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు.

రైతులు పండించిన అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధరను నిర్ణయించి, దళారీ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను కట్టడి చేసి సామాన్యుడిపై భారం తగ్గించాలని కోరారు.

కరువు పరిస్థితుల్లో మండలంలో అధికంగా సాగుచేసిన పత్తి పంట దిగుబడి తక్కువ రావడంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పత్తి పంటకు కింటాకు 15 వేల రూపాయల ఇటుపడతారు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం జూలూరుపాడు మండలాన్ని రీ సర్వే చేసి కరువు ప్రాంతంగా ప్రకటించాలని వారు కోరారు. స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ జూలూరుపాడు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించేందుకు ప్రభుత్వం వద్ద చొరవ చేయాలని వారు కోరారు.

కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ మండల నాయకులు లింగాల వీరభద్రం తోటకూరి నరేష్ ధనమంతరావు భద్ర లౌక్య రమేష్ చిన్న బాలు బోడకా సరోజిని రమణి సప్న సీతారాం రాములు తదితరులు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU