Kalluru: ఖమ్మం జిల్లాలో ప్రమాదం..జెసిబి క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్!

Kalluru: కల్లూరు మండలం వెన్నవల్లి గుట్ట వద్ద మట్టి తవ్వకాల్లో ప్రమాదం. జెసిబి క్యాబిన్‌ను కప్పేసిన మట్టి పెళ్లలు. కొనసాగుతున్న సహాయక చర్యలు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 4 Oct 2026 8:19 AM IST
Kalluru
X

Kalluru: ఖమ్మం జిల్లాలో ప్రమాదం..జెసిబి క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్!

Kalluru: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పెద్ద కోరుకొండి–వెన్నవల్లి గ్రామాల మధ్య గల వెన్నవల్లి గుట్ట వద్ద విషాదం నెలకొంది.. జెసిబి తో మట్టిని తోడుతూ టిప్పర్ లో నింపే ప్రయత్నంలో మట్టి పెళ్లలు ఒరిగి జెసిబి పై పడి క్యాబిన్ ను మట్టి పెళ్ళలు కప్పేయడంతో క్యాబిన్ లో ఉన్న జెసిబి డ్రైవర్ ను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

గత కొన్ని రోజులుగా వెన్నవల్లి గుట్ట వద్ద మట్టి తోలకపు పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే టిప్పర్ లో మట్టిని లోడ్ చేసేందుకు జెసిబి డ్రైవర్ గుట్ట మట్టిని సొరంగం తరహాలో తవ్వకాలు చేపట్టిన సమయంలో ఒక్కసారిగా మట్టి పెళ్ళలు కుప్పకూలి జెసిబి క్యాబిన్ ను, టిప్పర్ వెనుక భాగాన్ని కప్పేయడంతో జెసిబి క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ ప్రమాదకర పరిస్థితులలో ఉన్నాడని స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జెసిబి లతో మట్టిని తొలగించి డ్రైవర్ ను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

సుమారు నాలుగు గంటలు గడవటం మట్టితో క్యాబిన్ పూడుకుపోవడం తో క్యాబిన్లో వున్న డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి పై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

గత కొన్ని రోజులుగా గుట్టను తవ్వుతూ మట్టితోలకు పనులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కొందరు గ్రామస్తులు ఆరోపిస్తూ అనుమతితోనే మట్టితోలకు పనులు జరుపుతున్నారా, భద్రతా నిబంధనలు పాటిస్తున్నారా, ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై మైనింగ్ శాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI