Bayyaram: వినూత్న 'జిలేబీ ఆట'.. కడుపుబ్బ నవ్విన కాలనీవాసులు!

Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం కొమరం భీమ్ కాలనీలో గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వినూత్న 'జిలేబీ ఆట' కాలనీవాసులను ఎంతగానో ఆకట్టుకుంది.

NARASIMHARAO, BAYYARAM
Published on: 17 Sept 2026 10:39 AM IST
Bayyaram
X

Bayyaram: వినూత్న 'జిలేబీ ఆట'.. కడుపుబ్బ నవ్విన కాలనీవాసులు!

Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తపేట గ్రామంలో కొమరం భీమ్ కాలనీ ఆదివాసులైన (కొయ్య )సామాజిక ఆధ్వర్యంలో నిర్వహించే నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 3వ రోజున కొత్తపేట గ్రామంలో కుల పెద్దలు అయిన దొర, పటేల్ గణనాధుడికి ఘనంగా పూజలు పురోహితులు ఆధ్వర్యంలో నిర్వహించారు.

కుల పెద్దయిన దొర మెస్సు రాజశేఖర్, పటేల్ పులసం రమేష్ కుటుంబ సమేతంగా గణనాధుని పూజలో పాల్గొని, ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు, భక్తిశ్రద్ధలతో సంప్రదాయం నృత్యాలు, క్రీడలు పెంపొందించేందుకు చిన్నలకు, పెద్దలకు కుర్చీలాట, స్పూన్ లో నిమ్మకాయ, జిలేబి ఆట, క్రీడలు నిర్వహించి బహుమతులు అందజేయడం జరిగింది.

ఈ క్రీడలు ఉద్దేశించి మహిళలు మాట్లాడుతూ.. మా చిన్నతనములో పాఠశాలకు వెళ్లేటప్పుడు ఈ ఆటలు ఆడేమని మరల ఈరోజు ఆడటం వల్ల, మా పాఠశాల రోజులు గుర్తుకొస్తున్నాయని ఈ సంతోషం పట్టలేక పోతున్నామని అన్నారు, ప్రత్యేకంగా జిలేబి ఆట అందరిని కడుపుబ్బ నవ్వించింది.

ఆట ప్రత్యేకత కాలు పెద్దయిలకు దారం కట్టి, ఆధారానికి మరోపక్క జిలేబి కట్టి పైన దండం పై వేలాడుతీస్తూ. దారం కట్టిన కాలును పైకి లేపుతూ జిలేబి కిందికి రాగా చేతి పట్టుకోకుండా నోటి సహాయంతో తినే విధానాన్ని అందర్నీ ఆకర్షించింది ఇలాంటి ఆట మేము ఎప్పుడు చూడలేదని ఆ గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.

ఈ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు ఈ ఆట మాకు ప్రత్యేకంగాను, సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. కాలనీ ప్రజలు మాట్లాడుతూ.. మేము ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉంటున్న కాలనీవాసులం అందరం ఒకచోట చేరిక చాలా రోజులు గడుస్తుంది.

గణనాధుని నవరాత్రుల సందర్భంగా ఒక చోట చేరి పూజలు, ఆటపాటలతో, సందడి చేస్తూ మా సంతోషాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు, ఈ కార్యక్రమంలో కాలనీ గ్రామ ప్రజలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM