Bhadradri: ఐటీడీఏ భద్రాచలం ఆధ్వర్యంలో నేడు మణుగూరు గురుకుల కళాశాలలో జాబ్ డ్రైవ్!

Bhadradri: ఐటీడీఏ భద్రాచలం ఆధ్వర్యంలో మణుగూరు మిట్టగూడెం గురుకుల డిగ్రీ కళాశాలలో గిరిజన యువత కోసం గురువారం మెగా జాబ్ డ్రైవ్ నిర్వహిం.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 25 Nov 2026 3:07 PM IST
Bhadradri
X

Bhadradri: ఐటీడీఏ భద్రాచలం ఆధ్వర్యంలో నేడు మణుగూరు గురుకుల కళాశాలలో జాబ్ డ్రైవ్!

Bhadradri: తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏ భద్రాచలం, యూత్ ట్రైనింగ్ సెంటర్ (YTC) భద్రాచలం మరియు AFC India Ltd. వారి సంయుక్త సహకారంతో, TGTWR డిగ్రీ కళాశాల (బాలుర), మణుగూరు (మిట్టగూడెం) ఆధ్వర్యంలో గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ డ్రైవ్ .నిర్వహించబడుతుందని గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రవి బండారు పల్లి బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మెగా జాబ్ డ్రైవ్ 2026 నవంబర్ 26వ తేదీ (గురువారం) నాడు ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు TGTWRDC (బాలుర), మణుగూరు (మిట్టగూడెం) కళాశాల ప్రాంగణంలో నిర్వహించబడుతుందని అన్నారు.అందుబాటులో ఉన్న ఉద్యోగాలు AFC – డ్రోన్ పైలట్ కమ్ టెక్నీషియన్ (Drone Pilot cum Technician),AFC – జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ (Junior Software Developer), AFC – కంప్యూటర్ ఆపరేటర్ (Computer Operator)విద్యార్హత,

10వ తరగతి నుండి డిగ్రీ వరకు విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు సంబంధించిన అర్హతల మేరకు పాల్గొనవచ్చు నని ఆయన అన్నారు.అభ్యర్థులకు సూచనలుఅర్హత కలిగిన షెడ్యూల్డ్ ట్రైబ్ (ST) వర్గానికి చెందిన యువతీ యువకులు ఎటువంటి ముందస్తు నమోదు అవసరం లేకుండా నేరుగా జాబ్ డ్రైవ్ నిర్వహించే ప్రదేశానికి హాజరు కావచ్చునని,అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, రెజ్యూమ్ (బయోడేటా), పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు మరియు ఇతర సంబంధిత ధ్రువీకరణ పత్రాలను తమ వెంట తీసుకొని రావాలని ఆయన అన్నారు.

గిరిజన యువతకు నైపుణ్య ఆధారిత మరియు సాంకేతిక రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ మెగా జాబ్ డ్రైవ్ ప్రధాన ఉద్దేశమని, అందుకు అర్హులైన గిరిజన యువతీ యువకులు మణుగూరు, మిట్ట గూడెం గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల (బాలురు) నందు ఈనెల 26వ తేదీ ఉదయం 9:30 నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగే మెగా జాబ్ డ్రైవ్ లో పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడం అయినది.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA