Bhadrachalam: కాచనపల్లి స్పోర్ట్స్ స్కూల్‌లో కబడ్డీ కోచ్ నియామకానికి దరఖాస్తులు!

Bhadrachalam: కాచనపల్లి గిరిజన మోడల్ స్పోర్ట్స్ స్కూల్ (బాలికలు) నందు కాంట్రాక్ట్ పద్ధతిపై కబడ్డీ కోచ్ నియామకానికి నవంబర్ 23–28 వరకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటీడీఏ పీవో బి. రాహుల్ తెలిపారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 19 Nov 2026 5:03 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: కాచనపల్లి స్పోర్ట్స్ స్కూల్‌లో కబడ్డీ కోచ్ నియామకానికి దరఖాస్తులు!

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంక్షేమ శాఖ, ఐ.టి.డి.ఎ. భద్రాచలం, పరిధిలో గల గిరిజన సంక్షేమ శాఖ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ (బాలికలు) కాచనపల్లి నందు కబడ్డీ కోచ్ గా తాత్కాలిక (కాంట్రాక్ట్ పద్ధతి పై నియమకమునకు గాను అర్హులైన గిరిజన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నియమకమునకు N.S, NIS Diploma / PG Diploma (one year course) ఉన్నవారు మాత్రమే అర్హులని, వారే దరఖాస్తు చేసుకోవాలని ఆయన అన్నారు. ఆసక్తి మరియు పైన తెలిపిన అర్హతలు కలిగిన వారు పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ను (Resume) తగు ధృవపత్రములు జతపరచి స్పోర్ట్స్ ఆఫీసర్, పిఎమ్ఆర్సి, ఐటిడిఎ, భద్రాచలం కార్యాలయం నందు వ్యక్తిగతంగా సమర్పించగలరని ఆయన అన్నారు.

ఈ యొక్క దరఖాస్తులను ఈనెల 23వ తేదీ నుండి 28వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు స్వీకరించబడునని, పూర్తి వివరాల కోసం సెల్ నంబర్ : 9848988205, 9912362053 (అన్ని పని దినాలలో ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 వరకు సంప్రదించి తెలుసుకోవాలని ఆయన కోరారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem