Bhadrachalam: జిసిసి కార్యాలయంలోని అన్ని రకాల అకౌంట్స్ బుక్స్ పరిశీలన!

Bhadrachalam: జిసిసి కార్యాలయంలో డిఆర్ డిపోలు, నిత్యవసర సరుకుల కొనుగోలు అమ్మకాలు, పెట్రోల్ బంకుల నిర్వహణకు సంబంధించిన రికార్డులను ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజ్ పరిశీలించారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 12 Nov 2026 1:55 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: జిసిసి కార్యాలయంలోని అన్ని రకాల అకౌంట్స్ బుక్స్ పరిశీలన!

Bhadrachalam: జిసిసి పరిధిలోని డిఆర్ డిపోలు మరియు జిసిసి కార్యాలయం ద్వారా ఇతర నిత్యవసర సరుకులు కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అకౌంట్ బుక్స్ ఇతర రికార్డ్ బుక్కులు పరిశీలించడం జరిగిందని ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు.

ఈరోజు తన చాంబర్లో ఐటీడీఏ పీవో బి రాహుల్ ఆదేశాల మేరకు సంవత్సరం కాలంగా జిసిసి లో ఇతర నిత్యవసర సరుకులు కొనుగోలు అమ్మకాలు గిరిజన సంక్షేమ శాఖ ఇన్స్టిట్యూషన్లకు సరఫరా చేసిన నిత్యవసర సరుకుల వివరాలు పెట్రోల్ పంపులు నిర్వహణకు సంబంధించిన ఇతర రకాల రికార్డులను నెలల వారీగా నమోదు చేసిన వివరాలను పరిశీలించడం జరుగుతుందని ఆయన అన్నారు.

రసీదులో మరియు ఇతర బిల్లుల ప్రకారం రిజిస్టర్ లలో నమోదు చేసినవి లేనిది పూర్తిస్థాయిలో పరిశీలించి సంబంధిత రికార్డులను ఐటిడిఏ పిఓ కు అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిసిసి మేనేజర్ సమ్మయ్య మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem