Bhadrachalam: గిరిజనులు సమర్పించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి!
Bhadrachalam: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో గిరిజనులు సమర్పించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని ఏపీవో డేవిడ్ రాజ్ ఆదేశించారు.
Bhadrachalam: గిరిజనులు సమర్పించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి!
Bhadrachalam: గిరిజన దర్బార్ లో అర్జీలు పెట్టుకున్న ఆదివాసి గిరిజనులకు అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే విధంగ సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్ట్ అధికారి జనరల్ డేవిడ్ రాజ్ యూనిట్ అధికారులను ఆదేశించారు.
సోమవారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అధికారిక పనులపై వెళ్లి అందుబాటులో లేనందున ఆర్సిఓ గురుకులం అరుణకుమారి ఏడిఎంహెచ్వో సైదులతో కలిసి వివిధ గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుండి అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులకు పంపుతూ అర్జీలు పెట్టుకున్న ఆదివాసి గిరిజనులకు జీవనోపాధి పెంపొందించుకోవడానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని ఐటీడీఏ యూనిట్ అధికారులకు సూచించారు.
గిరిజనులు సమర్పించిన అర్జీలలో పోడు భూముల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, భూసమస్యలు,కిరాణాషాపులు ,ఫ్యాన్సీ స్టోర్లు రుణాల కొరకు, సౌర జల విద్యుత్ ద్వారా కరెంటు ఇప్పించుట కొరకు, జీవనోపాధిపెంపొందించుకోవడానికి స్వయం ఉపాధి రుణాలు ఇప్పించుట కొరకు, గిరిజన గ్రామాలలో కరెంటు సౌకర్యం కల్పించుట కొరకు, ఒంటరి మహిళ, వితంతు మహిళ ప్రోత్సాహాల కొరకు ,గిరిజన రైతులకు రైతుబంధు రుణాలు ఇప్పించుట కొరకు, కళ్యాణ లక్ష్మి ప్రోత్సహకాల కొరకు, పై చదువులకు ఆర్థిక సహాయం అందించుట కొరకు, దీర్ఘకాల వ్యాధులకు ఆర్థిక అభివృద్ధి కల్పించుట కొరకు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల కొరకు, ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో జీవనోపాధి పెంపొందించుకోవడానికి శిక్షణలు ఇప్పించుట కొరకు దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు.
గిరిజన దర్బార్ లో దాదాపు 150 పైగా దరఖాస్తులు వచ్చాయని అన్నారు. గిరిజన దర్బార్ లో వచ్చిన అర్జీలు అన్ని ప్రత్యేకంగా ఆన్లైన్లో నమోదు చేసి, విడతల వారీగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉద్యానవనధికారి ఉదయ్ కుమార్, ఏపీవో పవర్ వేణు, ఏవో సున్నం రాంబాబు, మేనేజర్ ఆదినారాయణ, మిషన్ భగీరథ ఏ ఈ ఈ హౌసింగ్ ఏఈ హేమంత్, వివిధ విభాగాల సిబ్బంది మోహన్, నాగేశ్వరరావు, ప్రమీల భాయ్, జోగారావు, వెంకటేశ్వర్లు, విజయ్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.




